తెలుగు అమ్మాయిలకు ...తెలుగు సినిమాలలో అవకాశాలు లభించడాన్నే తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద విజయంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్దితి. ఆఫర్స్  కోసం పలువురు తెలుగు హీరోయిన్స్ ఎదురు చూస్తుంటారు. అలా కొంతకాలానికి అవకాశాలు వచ్చిన తర్వాత... కెరీర్ మంచి పీక్స్ లో ఊపందుకుంటోంది అనగానే పెళ్లి చేసుకుని సినిమాకు దూరమైపోతారు. అయితే అది కొంతకాలమే.  మళ్లీ రీఎంట్రీ కొసం ఎంతగానో తహతహ లాడుతుంటారు. ఆ కోవకే చెందిన మరో నటి కలర్స్ స్వాతి. ఆమె ఓ వెబ్ సీరిస్ లో నటించటానికి రంగం సిద్దం చేసుకుంటోంది. 

వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఆడవారి మాటకు అర్థాలే వేరులే చిత్రంతో ఓ చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. హీరోయిన్ గా వరస సినిమాలు చేశారు. సినిమాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్న తరుణంలో ఫైలట్ వికాస్‌ను 2018లో వివాహం జరిగింది. దీంతో ఆమె భర్తతో పాటు జకర్తాలో సెటిల్ కావడంతో సినిమాలకు దూరం అయ్యారు. 

అయితే  కలర్స్ స్వాతి దృష్టి సినిమాలపై మారింది.  లాంగ్ గ్యాప్ తరువాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు. దీని కోసం ఆమె ఎంతగానో కష్టపడింది ఇప్పుడు చాలా ఆమె లుక్‌ను పూర్తిగా మార్చేసిది. కలర్స్ స్వాతి పూర్తిగా బక్కచిక్కిపోయి సన్నగా మారింది.  అలాగే ప్రస్తుతం ఆమె హైదరాబాద్ వచ్చి ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది. అందులో భాగంగా ఓ వెబ్ సీరిస్ కు సైన్ చేసిందని సమాచారం. బాగా తెలుసున్న డైరక్టరే ఈ సీరిస్ ని డైరక్ట్ చేయబోతున్నారట.
 
కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న 'కలర్స్' స్వాతి, అతన్నుండి విడిపోనుందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయగా, స్వాతి స్పందించింది. గతంలో ఇలియానా, సనా ఖాన్ తదితర హీరోయిన్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తరువాత, వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. తాజాగా స్వాతి సైతం వికాస్ తో కలిసున్న చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసేసింది.

ఇంకేముంది, ఆమె భర్తకు దూరమైందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు బయలుదేరాయి. వీటిపై వివరణ ఇచ్చిన స్వాతి, అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. భర్తతో తాను దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ, తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపిస్తూ, ఓ చిన్న వీడియోను తీసి, దాన్ని పోస్ట్ చేసింది. అప్పట్లో అదో సెన్సేషన్ అయ్యింది.