టాలీవుడ్ లో ఎందరు సంగీత దర్శకులు ఉన్నా.. టాప్ రేసులో దూసుకుపోతుంది మాత్రం దేవిశ్రీప్రసాదే.. ఆ తరువాత స్థానాల్లో తమన్, గోపిసుందర్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. దేవిశ్రీప్రసాద్, తమన్ ల మధ్య పోటీ ఉన్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ బయటకి సన్నిహితంగానే ఉన్నప్పటికీ కోల్డ్ వార్ జరుగుతుందని సన్నిహితులు అంటుంటారు. ఇది నిజమేనని తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 'మహర్షి' సినిమాలో ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోయాడు దేవి. రెండు పాటల మినహా మిగిలినవన్నీ తేలిపోయాయి.

కానీ మహేష్ మాత్రం దేవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన తదుపరి సినిమాకు కూడా దేవిశ్రీప్రసాద్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ క్రమంలో మహేష్ అభిమాని దేవిని కాకుండా తమన్ ని తీసుకోమని సూచిస్తూ 'దూకుడు' సినిమాకు సంబంధించిన ఇంట్రో క్లిప్ ని అందులో పొందుపరిచాడు. అంతేకాదు దేవిపై నెగెటివ్ కామెంట్స్ కూడా చేశాడు.

అయితే ఈ పోస్ట్ కి తమన్ లైక్ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సదరు అభిమాని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తమన్ చెప్పకనే చెప్పాడు. ఈ పోస్ట్ కాస్త దేవిశ్రీప్రసాద్  అభిమానుల కంట పడడంతో వాళ్లు తమన్ ఫెయిల్ అయిన క్లిప్స్ తో కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. మొత్తానికి ఒక లైక్ పెద్ద వివాదానికి దారి తీసేలా ఉంది!