సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దుసుకుపోతోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దుసుకుపోతోంది. దీనితో చాలా కాలం తర్వాత రజనీ స్థాయికి తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవుతున్నాయి.
రిటైర్డ్ పోలీస్ అధికారిగా రజనీకాంత్ ఎప్పటిలాగే స్టైలిష్ గా అదరగొట్టారు. తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, వసంత్ రవి, యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలం తర్వాత రజనీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జైలర్ చిత్రాన్ని వీక్షించారు. అంతేకాదు తన సంతోషాన్ని తెలియజేస్తూ సినిమా విశేషాలని పంచుకుంటూ రివ్యూ కూడా ఇచ్చారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ చిత్రంపై ప్రశంసల జల్లులు కురిపించడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గాల్లో తేలిపోతున్నారు. సీఎం స్టాలిన్ జైలర్ చిత్రం చూసిన అనంతరం ఆయన అభినందించారు అంటూ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
'జైలర్ చిత్రాన్ని వీక్షించిన గౌరవ ముఖ్యమంత్రి స్టాలిన్ సర్ కి నా కృతజ్ఞతలు. మీరిచ్చిన స్ఫూర్తికి, ప్రశంసలకు రుణపడి ఉంటాను. మీ అభినందనలతో రజనీకాంత్ సర్, కళానిధి మారన్ సర్, ఇతర చిత్ర యునిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం ' అంటూ నెల్సన్ తన స్పందన తెలియజేశారు.
తెలుగు రాష్ట్రలో తొలి రోజు ఈ చిత్రం ఏకంగా 7 కోట్ల షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా 91 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ డే రోజునే తలైవా చిత్రం సాధించింది. జోరు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు జైలర్ చిత్రంలో భారీ లాభాలు అందుకునేలా ఉన్నారు. తెలుగురాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం 12 కోట్లు మాత్రమే. తొలిరోజే 7 కోట్లు రాబట్టేసింది.
