నిన్న రిలీజ్ అయిన భరత్ అనే నేను టీజర్ అందరినీ ఆకర్షిస్తూ యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తుంది. ఈ టీజర్ లో మహేష్ స్టైల్, డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అదిరిపోయే రేంజ్ లో ఉంది. కొరటాల జనతాగ్యారేజ్ సక్సెస్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు బారీగానే ఉన్నాయి. ఇప్పుడు మహేష్ కి కూడా హిట్ చాలా అవసరం. సోసల్ మీడియాలో ఎప్పటిలాగానే ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు.   భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎంగా నటిస్తున్న విషయం తెలిసిందే. పైనున్న పిక్ లో మహేష్ కి బదులుగా ఎన్టీఆర్ ఫోటో పెట్టి అందులో తారకరామ్ సీఎం అనే పిక్ సోషల్ మీడియో మొత్తం వైరల్ అవుతుంది. ఫ్యాన్ మాత్రం ఎన్టీఆర్ ఎప్పటికైన సీఎం అవుతాడు కదా అని.. ఈ పిక్ చూసి సంబరపడిపోతున్నారు.