సుశాంత్ రాజ్ పుత్ మరణం కేసు సీబీఐ విచారణకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో కొద్దిరోజులుగా ఈ విషయమై పోరాటం చేస్తున్న సుశాంత్ కుటుంబ సభ్యుల కోరిక తీరినట్లు అయ్యింది. బీహార్ గవర్నమెంట్ సైతం కేంద్రాన్ని సుశాంత్ కేసు సీబీఐ కి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ముంబై పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత చోటు చేసుకుంది. 

కాగా ఈ విషయంపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసును సీబీఐకి బదిలీ చేసిన తరువాత న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు అన్నారు. సుశాంత్ డెత్ కేసు కేవలం ఒక కుటుంబానికి లేదా రాష్ట్రానికి చెందినది కాదు, ఇది దేశం మొత్తానికి సంబంధించిన విషయం అన్నారు. సుశాంత్ కేసు విషయంలో బీహార్ పోలీసులు విచారణకు ముంబై రాగా, ముంబై పోలీసులు సహకరించలేదన్నారు. 

సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలతో ఆయన కూడా సుశాంత్ మరణంలో కుట్ర కోణం ఉందని గట్టిగా నమ్ముతున్నారని అనిపిస్తుంది. సుశాంత్ మరణంపై ఇప్పటికే కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్నారు అనేది నిజం కాదని కొందరి వాదన. మరి కొందరు సుశాంత్ చంపడ్డారనే ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులలో భయం మొదలైందని వినికిడి.