యంగ్ హీరో నిఖిల్, గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ జంటగా  నటించిన చిత్రం ‘18 పేజెస్’. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. వినసొంపుగా ఉన్న ఈ క్లాసీ మెలోడీ ఆకట్టుకుంటోంది.  

యంగ్ హీరో నిఖిల్ (Nikhil), గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) మరోసారి జంటగా అలరించబోతున్నారు. చివరిగా ‘కార్తీకేయ 2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ జోడీ ప్రస్తుతం ‘18 పేజెస్’ అనే బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో అలరించబోతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈచిత్రం ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని తుది మెరుపులు దిద్దుకుంటోంది. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ ‘18 పేజెస్’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ గా ‘నన్నయ్య రాసిన’ (Nannaya Raasina) అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు. 

‘‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా 
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా 
నీలో స్వరాలకే నేనే సంగీతమై 
నువ్వే వదిలేసిన పాటై సాగేనా 
నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా 
రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా’’ 

అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. 
ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘నన్నయ్య రాసిన’ పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ అదర్భుతంగా ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది. ఖచ్చితంగా మెలోడీ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. గతంలో ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. 

Scroll to load tweet…