తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు.
తమిళ క్రేజీ హీరో శింబు యువతలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో శింబు వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు. తమిళనాట శింబుకి రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఎక్కువగా శింబు గురించి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆయన ఫ్యామిలీ వివాదాల్లో ఉండడం కూడా చూస్తున్నాం. శింబు తండ్రి టి రాజేందర్ తమిళనాడులో సీనియర్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తండ్రి వారసత్వంతో శింబు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటికీ తనకంటూ సపరేట్ స్టార్ డమ్ ఏర్పరుచుకున్నారు. ఇక శింబు గురించి ఎక్కువగా ప్రేమ, పెళ్లి లాంటి రూమర్స్ వైరల్ అవుతుంటాయి.

పాపం శింబుకి రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ జరిగింది. అదేమీ రహస్యం కాదు. మొదట నయనతారతో ఆ తర్వాత హన్సికతో శింబుకి బ్రేకప్ జరిగింది. రెండూ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన స్టోరీలే. ఆ తర్వాత శింబు ఎవరి ప్రేమలోనూ పడలేదు. అయితే గత కొన్ని రోజులుగా.. శింబు త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అని.. కుటుంబ సభ్యులు శ్రీలంకకు చెందిన బిజినెస్ మ్యాన్ కుమార్తెతో మ్యాచ్ ఫిక్స్ చేశారని వార్తలు జోరందుకున్నాయి. అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనేంత రేంజ్ లో సోషల్ మీడియాలో హంగామా సాగింది.

కానీ శింబు మ్యానేజర్ ఒక్కసారిగా ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. శ్రీలంక బిజినెస్ మ్యాన్ కుమార్తెతో శింబు పెళ్లి జరగబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ రూమర్స్ ని ఖండిస్తున్నాం. పెళ్లి లాంటి వ్యక్తిగత విషయాల గురించి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. శింబు వివాహం గురించి నిజంగా ఏదైనా వార్త ఉంటే ఆయనే సంతోషంగా ప్రకటిస్తారు అని మేనేజర్ తెలిపారు.
గత ఏడాది నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. కొన్ని వారాల క్రితం హన్సిక కూడా తన ఫ్రెండ్ సోహైల్ ని మ్యారేజ్ చేసుకుంది. శింబు మాజీ లవర్స్ ఇద్దరికీ పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ శింబునే అంటూ కొందరు పుకారు రాయుళ్లు ఈ ఫేక్ న్యూస్ వైరల్ చేశారు.
