అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం 'మన్మథుడు 2'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 15న ప్రభాస్ 'సాహో' సినిమా వస్తుందని తెలిసే 'మన్మథుడు 2' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఏదో తాత్కాలికంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని, దగ్గర చేసి వాయిదా వేస్తారని భావించారు. కానీ అసలు వాయిదా వేసే ఆలోచన 'మన్మథుడు 2' టీమ్ కి లేదని తెలుస్తోంది. 'సాహో' వస్తుందని తెలిసే డేట్ వేశామని, వెనక్కి తగ్గేదే లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

జూలై నెల నుండి బాక్సాఫీస్ వద్ద సినిమాల తాకిడి ఓ రేంజ్ లో ఉంది. జూలై 18న 'ఇస్మార్ట్ శంకర్', 25న విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్', ఆగస్ట్ 2న 'రణరంగం', 'రాక్షసుడు',  'గుణ 369', ఆగస్ట్ 9న 'మన్మథుడు 2', 15న 'సాహో', 31న 'గ్యాంగ్ లీడర్', ఆ తరువాత సెప్టెంబర్ మొదటి వారంలో 'వాల్మీకి' ఇలా చాలా సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి.

ఆగస్ట్ 9న న గనుక మిస్ అయితే దాదాపు నెల రోజుల వరకు వాయిదా వేయాల్సివుంటుందని అందుకే చెప్పిన డేట్ కి రావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.