దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాసరి తనయులు దాసరి అరుణ్‌, దాసరి ప్రభులకు ఆర్డర్‌ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. 

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాసరి తనయులు దాసరి అరుణ్‌, దాసరి ప్రభులకు ఆర్డర్‌ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. బుధవారం దాసరి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. వ్యాపార లావాదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్‌ నిర్మాణం కోసం సోమశేఖర్‌రావు అనే వ్యాపారి వద్ద ప్రభు, అరుణ్‌లు రెండు కోట్ల 11లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 

అయితే ఆ తిరిగి డబ్బులు చెల్లించడంలో వారు జాప్యం చేస్తున్నారంటూ సోమశేఖర్‌రావు సివిల్‌ కోర్ట్ ని ఆశ్రయించాడు. అలాగే దాసరి ప్రభు, అరుణ్‌ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడం లేదని, త్వరలో తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలని కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో కోర్ట్ దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ రెండు వారాల్లో డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్‌లను ఆదేశించింది. ఈ నెల 15వ తేదీ వరకూ చెల్లించాలని తెలిపింది. 

దర్శకరత్న Dasari Narayanarao తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి గుర్తింపుని తెచ్చుకున్న విషయం తెలిసిందే. దర్శకుడి ఓ స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. దర్శకుడు అంటే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అనే పదానికి సరైన అర్థాన్నిచ్చారు. 152 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు క్రియేట్‌ చేశారు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చే దాసరి ఉన్నారనే భరోసా ఉండేది. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఏ వివాదమైనా దాసరి వద్దకు వెళితే పరిష్కారం అవుతుందనే పేరు ఉండేది. ఆయనే పెద్దరికం తీసుకుని సాల్వ్ చేసేవారు. ఇండస్ట్రీ విషయాలు బయటకు పొక్కకుండా చూసుకునే వారు. 

అలాంటిది ఆయన ఇంట్లో సమస్యలను పరిష్కరించలేకపోయారు. ఆయన మరణాంతరం ఇద్దరు కుమారులు ఆస్తుల కోసం గొడవలకు దిగడం, కోర్టు మెట్లు ఎక్కడం వివాదంగా మారింది. ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు రావడం, ఆ మధ్య ఆస్తుల విషయంలో మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసుకోవడం విచారకరం.