Asianet News TeluguAsianet News Telugu

దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్‌: అమ్మొద్దని అమెజాన్‌కు కోర్టు ఆదేశం

గత ఏడాది జులైలో  విజయ్‌ దేవరకొండ 'రౌడీ' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఈ బ్రాండ్‌కు యూత్ లో మంచి క్రేజ్‌ కూడా ఏర్పడింది. అయితే ఈ బ్రాండ్‌ పేరుతో స్థానిక వ్యాపారస్థులు నకిలీ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. 

Civil Court asked Amazon to immediately stop the sale  Rowdy Brand
Author
Hyderabad, First Published Feb 27, 2019, 9:28 AM IST

 గత ఏడాది జులైలో  విజయ్‌ దేవరకొండ 'రౌడీ' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  ఈ బ్రాండ్‌కు యూత్ లో మంచి క్రేజ్‌ కూడా ఏర్పడింది. అయితే ఈ బ్రాండ్‌ పేరుతో స్థానిక వ్యాపారస్థులు నకిలీ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కొందరు ప్యాకేజీపై విజయ్‌ ఫొటోను ఉంచి.. 'జనరిక్‌' పేరుతో ఈ కామర్స్‌ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల 'రౌడీ' ప్రైవేట్‌ లిమిటెడ్ బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో దావా వేసింది. అమెజాన్‌లో నకిలీ 'రౌడీ' దుస్తుల అమ్మకం జరుగుతోందని ఆధారాలతో కోర్ట్ కు సమర్పించింది. విజయ్‌ ఫొటోను ప్యాకింగ్‌లో ఉంచి పబ్లిసిటీకి ఉపయోగిస్తున్నారని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో విజయ్‌ అసిస్టెంట్‌ ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. 'అమెజాన్‌లో 'రౌడీ' బ్రాండ్‌ను అమ్ముతున్నారని 'రౌడీ' మేనేజర్లు గుర్తించారు. దీంతోపాటు కొందరు ప్యాన్స్ కూడా ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నకిలీ 'రౌడీ' దుస్తులు అమ్ముతున్న వ్యాపారస్థులపై చర్యలు తీసుకున్నాం.

ఈసారి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచి ఈ సమస్య ఏర్పడింది' అని అన్నారు. ఈ మేరకు కోర్టు విజయ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తమ వెబ్‌సైట్‌లో నకిలీ 'రౌడీ' బ్రాండ్‌ను అమ్మకూడదని అమెజాన్‌ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ మార్చి 29న జరగనుంది.

  

Follow Us:
Download App:
  • android
  • ios