హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా గులాబీ అధినేత కేటీఆర్ ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొనబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ప్రస్తుతం 'భీమ్లా నాయక్' ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సైతం భారీగా క్లిక్ అయ్యింది. అతితక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ పొందిన ట్రైలర్ గా ఇది నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించి ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 25) సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర టీమ్ సన్నాహాలు చేస్తోంది.

 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సోమవారం (ఫిబ్రవరి 21) చిత్ర ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణానికి సంతాపంగా ఆ వేడుకను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఈవెంట్ ను బుధవారం (ఫిబ్రవరి 23) నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా గులాబీ అధినేత కేటీఆర్ ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొనబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఇక్కడే జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేవారి కోసం పోలీసులు కీలక నిబంధనలు పెట్టారు.

 ఈ ఈవెంట్ కి సంబంధించి పోలీసులు అభిమానులకు పలు సూచనలు కండీషన్ లు పెట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం..అనవసర గొడవలని.. తొక్కిసలాటలని నివారించాలని అందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ వారు కీలకంగా మరిన్ని సూచనలని చేశారు.

పోలీసులు చేసిన సూచనలు ఇలా వున్నాయి

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్నవారికే లోనికి అనుమతి

* ఫిబ్రవరి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్లవు. కొత్త పాసులు వున్నవారినే లోనికి అనుమతిస్తారు.

*వందల సంక్షలో వామనాలు వస్తే సరైన పార్కింగ్ లభించడం కష్టం. వ్యక్తిగత వాహనాలలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా సభా స్థలికి చేరుకుంటే మంచిది.

* పాసులు లేనివారు గ్రౌండ్ వద్దకు వచ్చి గుమిగూడటానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతి లేదు.

* పాసులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దు. దయచేసి పనులు లేని వారు రావద్దు.

* ప్రీ రిలీజ్ ఈ వెంట్ జరిగే ప్రాంతానికి పనులు లేకుండా వచ్చి గొడవ పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

* మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య యూసఫ్ గూడ చెక్ పోస్ట్.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం వుంది. కాబట్టీ వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంకిచ చేసుకోవండీ.

*జూబ్లీ హిల్స్ రకోడ్ నెం. 5 నుంచి యూసఫ్ గూడా వైపు వెళ్లే వాళ్లు కమలాపురి కాలనీ రోడ్డును ఎంచుకోవాలి.

* అమీర్ పేట్ నుంచి యూసఫ్ గూడా మీదగా జూబ్లీ హిల్స్ వెళ్లే వారు గణపతి కాంప్లెక్స్ మీదుగా కమలాపురి కాలనీ రోడ్డు ఇందిరానగర్ మీదుగా వెళ్తే మంచిది.

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చి వారు తమ వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేయాలి. రోడ్డు మీద పార్క్ చేస్తే సీజ్ చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటాం.