నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. దాంతో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నేషనల్ వైడ్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇండియా వైడ్ గా ఈ  చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడింది.   

బాలీవుడ్‌లో తమదైన మార్కు వేసిన మన తెలుగు వాళ్లు రాజ్‌ అండ్‌ డి.కె! వాళ్ళే సినిమా బండి టైటిల్ తో ఓ చిన్న దేశవాళీ భారతీయ చిత్రాన్ని ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో నిర్మించారు. దర్శకుడు ముందుగా ఇదే కథను ఓ షార్ట్‌ ఫిల్మ్‌ ఫక్కీలో పైలట్‌ వెర్షన్‌లా తీసి నిర్మాతలకు చూపారు. ఆ తారాగణమే వెండితెరకూ ఎక్కి ఘన విజయం సాధించింది. ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో జరిగే ఈ కథ ఇప్పుడు అందరికీ తెగ నచ్చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. దాంతో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నేషనల్ వైడ్ టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇండియా వైడ్ గా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడింది.

గొల్ల‌ప‌ల్లి అనే ఊళ్లో ఓ ఆటోడ్రైవర్‌కు తన ఆటో బ్యాక్ సీట్లో ఓ కెమెరా దొరుకుతుంది. దాన్ని ఆ ఊర్లో పెళ్ళిళ్ల‌కు ఫొటోలు తీసే స్నేహితుడు దగ్గరకు పట్టుకెళ్లి చూపెడతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ కెమెరాతో తాను తన గ్రామంలో, తన స్నేహితులతో ఓ సినిమా తీయాలనుకుంటాడు. కానీ అతనికిగానీ, అతని స్నేహితులకు కానీ సినిమాను ఎలా తీస్తారో తెలియదు. కానీ ఎన్నో సినిమాలను చూసిన వారి అనుభవం, వారికి దొరికిన కెమెరా సినిమా తీయాలనే తపన వారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఈ ప్రయాణంలో ఆ ఆటోడ్రైవర్‌ ఎదుర్కున్న పరిణామాలు, ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు అన్నీ వినోదాత్మకంగా బాగుంటాయి. వారి అమాయకత్వం, సినిమా చేయాలనే వారి ఆసక్తి చూసే వీక్షకులకు బాగా నచ్చుతుంది. 

ఆంధ్రప్రదేశ్, కర్ణాకట సరిహద్దుల్లో ఉండే ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. వారి మాండలికంలో తెలుగు, కన్నడ భాషలు మిళిత‌మై ఉంటాయి. వీరు మాట్లాడేభాషను ఇదివరకు ఆడియన్స్‌ వినడంగానీ, చూసిగానీ ఉండరు. రాజ్‌ అండ్ డీకే వంటి ప్రముఖ దర్శకులు ఈ సినిమాను పర్యవేక్షించడం, అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమా స్ట్రీమింగ్‌ కావటం కలిసొచ్చింది.

‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ అద్భుతమైన సక్సెస్‌తో హిందీ ప‌రిశ్ర‌మతో పాటు ‌మిగతా ఇండస్ట్రీల చూపును తమ వైపు తిప్పుకున్నారు దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే (రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే). కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఫిల్మ్‌ మేకర్స్‌ను ప్రొత్సహించడంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఈ దర్శక ద్వయం. ఆ ప్రయత్నంలో భాగంగానే `డీ2ఆర్‌ ఇండీ` అనే ఓ కొత్త బ్యాన‌ర్‌ను స్టార్ట్‌ చేసి ప్రతిభావంతులైన‌ కొత్తవారిని ప్రొత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా తెలుగులో తొలి అడుగుగా ఇండిపెండెంట్‌ కామెడీ ఫిల్మ్‌ ‘సినిమా బండి’ సినిమాను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సినిమా రిలీజైంది.

Scroll to load tweet…