యాక్సిడెంట్ లో సినీనటుడికి గాయాలు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 22, Apr 2019, 10:15 AM IST
cine actor met with accident
Highlights

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని సినీనటుడికి, ఆయన భార్యకు గాయాలయ్యాయి. 

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని సినీనటుడికి, ఆయన భార్యకు గాయాలయ్యాయి.

జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్ ప్రాంతంలో నివసించే ఆంజనేయులు తన భార్యతో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా గచ్చిబౌలికి వెళ్తుండగా.. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ కారు ఆంజనేయులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో అక్కడిక్కడే బైక్ మీద నుండి ఆంజనేయులు అతడి భార్య పడిపోయారు. వారి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. ఆంజనేయులు ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గాయాల కారణంగా షూటింగ్ కి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన కారును గుర్తించడానికి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, 

loader