Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ కు పోటీ ఆ సినిమానే, రిలీజ్ రోజు రెండింటి మధ్యా రచ్చే

ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ఫైనల్ సీక్వెన్స్ లు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది.ఈ సినిమా స్టోరీ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తునారు. 

Christmas 2021 release Pushpa vs Ranveer Singhs 83!
Author
Hyderabad, First Published Sep 27, 2021, 9:00 AM IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం‘పుష్ప’ . ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్  పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  దాదాపు కంటిన్యూ 45 రోజుల షూటింగ్‌తో ఈ  సినిమా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కానుంది.  ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ఫైనల్ సీక్వెన్స్ లు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం కూడా డిఫరెంట్‌గా కొత్తగా ఉంది.ఈ సినిమా స్టోరీ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తునారు. 

 మైత్రీ మూవీ మేకర్స్  భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.  ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తన మార్కెట్ పెంచుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా బన్నికి ఇదే తొలి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమాతో నార్త్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించనున్నారు అల్లు అర్జున్. ఇక అదే క్రిస్మస్ కు ఈ సినిమాతో ఓ బాలీవుడ్ చిత్రం పోటీ పడనుంది. ఆ సినిమా మరేదో కాదు.
 
టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ నటించారు. కపిల్‌ భార్య పాత్రలో దీపికా కనిపించనున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా విడుదలకానుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనుంది. అంటే పుష్ప సినిమాతో 83 చిత్రం పోటీ పడనుంది. 

మరో ప్రక్క ఆమీర్‌ ఖాన్‌, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకుడు. కరీనా కపూర్‌ హీరోయిన్. వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని 2021 క్రిస్మస్‌కి విడుదల చేయలేకపోతున్నామని తెలిపింది.

సెకండ్‌ వేవ్‌ తర్వాత డైరక్టర్ గా థియేటర్లలో విడుదలైన హిందీ చిత్రాలు పెద్దగా లేవనే చెప్పాలి. అందుకు కారణం మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకోకపోవడమే. తాజాగా థియేటర్లను వందశాతం తెరవాలని చిత్ర పరిశ్రమ నుంచి ఎందరో ప్రముఖులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి, అక్టోబరు 23 నుంచి థియేటర్లును తెరచేందుకు ఫర్మిషన్ ఇచ్చింది. దాంతో స్టార్ హీరోలు తమ చిత్రాల విడుదల తేదీని ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే తాను నటించిన ‘సూర్యవంశీ’ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌, ఆమీర్ ఖాన్‌ తమ తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios