హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రేమ్యాన్' ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ధనుష్...కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు హాలీవుడ్ లో నిరూపించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగా ప్రఖ్యాత రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘ది గ్రే మ్యాన్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ధనుష్ (Dhanush) హాలీవుడ్ చిత్రం ‘ది గ్రేమ్యాన్’ (The Gray Man)లో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ ఆంగ్ల సినిమాలో తమ అభిమాన నటుడు ఎలా కనిపిస్తాడోనన్న ఉత్కంఠ మొదలైంది. ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. క్రిస్ ఎవాన్స్- ర్యాన్ గోస్లింగ్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెట్ ఫ్లిక్సి లో జూలై 22న విడుదల కానుంది. ఆంథోనీ- జో రుస్సో దర్శకత్వంలో రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం ‘ద గ్రే మ్యాన్’. ర్యాన్ గోస్లింగ్-క్రిస్ ఎవాన్స్-అనా డి అర్మాస్- జెస్సికా హెన్విక- బిల్లీ బాబ్ థోర్న్టన్ – ఆల్ఫ్రే వుడార్డ్ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ది గ్రే మ్యాన్ అనే టైటిల్ కి తగ్గట్టే ఈ చిత్రం కోర్ట్ జెంట్రీ అనే ఫ్రీలాన్స్ హంతకుని కథను తెరపైకి తెస్తోంది. మాజీ ఏజెంట్ గురించి 2009 మార్క్ గ్రీనీ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది.
పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు. ‘కెప్టెన్ అమెరికా’, ‘అవెంజర్స్’ సిరీస్ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ (Russo Brothers) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్ తదితర హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
'ది గ్రేమ్యాన్'. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధనుష్ అభిమానులు కోసం ఓ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీటీమ్. ట్రైలర్‌ను విడుదల చేసింది. పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు.'కెప్టెన్ అమెరికా', 'అవెంజర్స్' సిరీస్ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్ తదితర హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది.