పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'పింక్' సినిమా రీమేక్ చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నారు. అయితే ఆ సినిమా హక్కులు తన వద్ద ఉన్నాయి కాబట్టి తనకు కూడా భాగస్వామ్యం కావాలని కోరడంతో బోనీకపూర్ కూడా నిర్మాతగా యాడ్ అయ్యారు.

దాంతో ఈ ప్రాజెక్ట్ కి ఇద్దరు నిర్మాతలు అయ్యారు. ఇది ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ దగ్గరకి అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లడం.. ఆయన ఓకే అనడానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సినిమాలు చేసే హారిక హాసిని బ్యానర్ కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో భాగమైంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. 

మేనేజర్‌ని తీసేసిన హీరో గోపిచంద్‌!

ఇప్పటికే స్క్రిప్ట్ బాధ్యత త్రివిక్రమ్ పై పడిందని అంటున్నారు. అయితే నిర్మాత దిల్ రాజు ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన ఆస్థాన దర్శకుడు, 'పింక్' రీమేక్ దర్శకుడు వేణు శ్రీరామ్ తోనే స్క్రిప్ట్ పనులు చేయించాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఆ విధంగా అయితేనే తనకు కంఫర్ట్ గా ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నాడట. 

త్రివిక్రమ్ స్క్రిప్ట్ అయితే దిల్ రాజు మధ్యలో కలుగజేసుకోవడానికి, తన ఇన్ పుట్స్ ఇవ్వడానికి కానీ అవకాశాలు ఉండవు. ఇది ఇలా ఉంటే.. త్రివిక్రమ్.. బన్నీ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సివుంది. దానికి కోసం తన సమయం వెచ్చించాల్సివుంటుంది.

కాబట్టి పింక్ రీమేక్ స్క్రిప్ట్ పై పని చేసే టైం ఉండదు. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో పక్కకి తప్పుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తప్పుకుంటే పవన్ ని హ్యాండిల్ చేయడం దిల్ రాజు వల్ల అవుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!