కరోనా కష్టాల సంగతి ఎలా ఉన్నా కుర్ర హీరోలు, నటుల పెళ్లిళ్లు ఆగడం లేదు. 2020లో వరుసగా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో నిఖిల్, నితిన్ మరియు రానా తాము ప్రేమించిన అమ్మాయిలతో ఏడడుగులు వేశారు.  మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ మరియు నటుడు పునీత్ పాథక్ తన ప్రేయసి నిధి మునీసింగ్ తో నిశ్చితార్థ కార్యక్రమం జరుపుకున్నారు. నిన్న ముంబైలో ఈ కార్యక్రమం సన్నిహితుల సమక్షంలో జరిగింది. 

వీరి నిశ్చితార్ద వేడుకకు సంబందించిన ఫోటోలను పునీత్ పాథక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే నిధి మునీసింగ్ రాకతో కొత్త జీవితం మొదలైంది అన్నట్లు క్యాప్షన్ ఇచ్చారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెవుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ పొగిడేస్తున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. 

డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో పాప్యులర్ అయిన పునీత్ పాథక్, ఆ షోలో రన్నరప్ గా నిలిచారు. హలా లక్ దిఖా జా, దిల్ హై హిందుస్తానీ, డాన్సు  ప్లస్, ఇండియా బనేగా మంచ్, డాన్స్‌ ఛాంపియన్స్‌ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు.2013లో వచ్చిన ఏబీసీడీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పునీత్, ఏబీసీడీ2, స్ట్రీట్ డాన్సర్ 3డి చిత్రాలకు వరుణ్ తో కలిసిపనిచేశారు.