సారాంశం
టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బర్త్ డే వేడుక `బీస్ట్` సెట్‌లో జరిగింది. దళపతి విజయ్ సమక్షంలో జానీ మాస్టర్ బర్త్ డే జరగడం విశేషం. విజయ్ .. జానీ మాస్టర్‌ని ప్రత్యేకంగా అభినందించారు.
టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బర్త్ డే వేడుక `బీస్ట్` సెట్‌లో జరిగింది. దళపతి విజయ్ సమక్షంలో జానీ మాస్టర్ బర్త్ డే జరగడం విశేషం. విజయ్ .. జానీ మాస్టర్‌ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సన్‌పిక్చర్స్ సంస్థ వెల్లడించింది. మరోవైపు యూనిట్‌తోపాటు దర్శకుడు నెల్సన్ కుమార్ కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో `బీస్ట్` చిత్రం రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీంతో షూటింగ్ సెట్‌లోనే జానీ మాస్టర్ చేత బర్త్ డే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెట్‌లో బర్త్ డే వేడుకని నిర్వహించారంటే బహుశా ఇప్పుడు సాంగ్ షూటింగ్ జరుగుతుందేమో అని టాక్. ఇక జానీ మాస్టర్ `ఢీ` డాన్స్ తో డాన్సర్‌గా పరిచయమై, అట్నుంచి `ద్రోణ` చిత్రంలో కొరియోగ్రాఫర్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. తనదైన స్టయిలీష్ స్టెప్పులతో తానేంటో నిరూపించుకున్నారు.
`జులై`లో `మీ ఇంటికి ముందు..`, `నాయక్`లో `లైలా ఓ లైలా `, `శుభలేఖ రాసుకున్నా..`, `అత్తారింటికి దారేదీ`లో `కెవ్వు కేక, `రేసుగుర్రం`లో ` సినిమా చూపిస్తా మావ.. ` వంటి పాటల్లో తన డాన్స్ తో ఉర్రూతలూగించారు. 'ఖైదీ నంబర్ 150'లో 'సుందరి...', 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేలు రాణి', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'బుట్టబొమ్మ...', 'ఇస్మార్ట్ శంకర్'లో టైటిల్ సాంగ్, 'రెడ్'లో 'డించక్... డించక్', 'భీష్మ'లో 'వాట్టే వాట్టే బ్యూటీ', ధనుష్ చిత్రం 'మారి-2' లో 'రౌడీ బేబీ' పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల 'రాధే'లో 'సిటీమార్...' పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.
మరోవైపు ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. ఇప్పకేటి `జే1` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతుంది. మురళీ రాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్. తాజాగా బర్త్ డే సందర్భంగా ఓషో తులసీరామ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'దక్షిణ' టైటిల్‌ని ఫిక్స్ చేశారు.