Thangalaan Release Date : సంక్రాంతి బరిలో విక్రమ్.. ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
చియాన్ విక్రమ్ నటించిన అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకే దిగుంతుండటం విశేషం. తాజాగా డేట్ ను ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా వదిలారు.
తమిళ స్టార్ చియాన్ విక్రమ్ (Vikram) ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. కొన్ని సినిమాలు చేసిన పర్లేదుగానీ ఆడియెన్స్ కు జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండాలంటారాయన. ఆ మేరకే సినిమాలు చేస్తుంటారు. విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో వెండితెరపై ప్రేక్షకులను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు. ఇక విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్’ (Thangalaan). ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ చేశారు దర్శకుడు పా.రంజిత్. ఆయన సినిమాలు ఎంత రూటెడ్ గా ఉంటాయో తెలిసిందే. 1870 - 1940 కాలం మధ్యలో ఈ పీరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఆదివాసి యుద్ధ వీరుడిగా చియాన్ విక్రమ్ మేకోవర్ చాలా షాకింగ్ గా, సర్ ప్రైజింగ్ గానూ ఉంది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇకఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
‘తంగలాన్’ సినిమాను 2024 జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "తంగలాన్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఇక నవంబర్ 1న Thangalaan Teaser ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. చిత్రంలో పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.