విక్రమ్ “తంగలాన్” తెలుగులో జాక్ పాట్ కొట్టింది
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ కావటం కలిసొచ్చింది. రెండో వారం నుంచి బాగా పికప్ అయ్యింది.
విక్రమ్ కి (Vikram) తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది.అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శివపుత్రుడు’ ‘అపరిచితుడు’ ‘ఐ’ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. తాజాగా విక్రమ్ లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ కి మంచి అప్లాజ్ వచ్చింది. తన క.ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘తంగలాన్’ (Thangalaan) మూవీ. ‘మైత్రి’ సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది. టీజర్, ట్రైలర్.. సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. దాంతో మంచి ఓపినింగ్స్ వచ్చాయి. దానికి తోడు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ కావటం కలిసొచ్చింది. రెండో వారం నుంచి బాగా పికప్ అయ్యింది.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ గిరిజన తెగ నాయకుడి పాత్రలో కనిపించాడు. కథ, క్యారెక్టర్, లుక్స్ పరంగా విభిన్న పాత్రలో విక్రమ్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక రోజురోజుకూ చియాన్ విక్రమ్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తంగలాన్ సినిమాకు థియేటర్స్ పెంచారు మేకర్స్. రిలీజైన ఫస్ట్ వీక్ కంటే రెండో వారానికి ఏకంగా 141 థియేటర్స్ పెరిగాయని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
దీనిని బట్టి తెలుగు రాష్ట్రాలలో తంగలాన్ సినిమాకి పెరుగుతోన్న ఆదరణ ఈ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవొచ్చు. కాగా, మొదటి వారం తంగలాన్ మూవీ 251 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.ఇక ఇప్పుడు 141 థియేటర్స్ యాడ్ చేయడంతో రెండో వారం నాటికి ఆ సంఖ్య 391కి పెరిగింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
‘తంగలాన్’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమా రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల హాలీడేస్ ను ‘తంగలాన్’ బాగానే క్యాష్ చేసుకుంది. కానీ 5 రోజు తర్వాత డ్రాప్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు థియేటర్స్ పెంచారు కాబట్టి కలెక్షన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.
“తంగలాన్” చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన “తంగలాన్” అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.