చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ తన సినిమాపై అంచనాలను పెంచుతున్నాడు. వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత చేసిన సినిమా చిత్రలహరి. ఈ సినిమా సక్సెస్ సాయికి ఒక్కడే కాకుండా సినిమా కోసం పనిచేసిన చాలా మందికి అవసరం.

రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ పాజిటివ్ టాక్ తో క్లిన్ U సర్టిఫికెట్ ను అందుకుంది. దీంతో సాయి ఈ సినిమాపై నమ్మకం మరింతగా పెంచేసుకున్నాడు. డైరెక్టర్ కిషోర్ తిరుమలకు కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా అవసరం. నేను శైలజా తరువాత చేసిన ఉన్నదీ ఒకటే జిందగీ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.
దీంతో అతను కూడా చిత్ర లహరి సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ అమర్ అక్బర్ ఆంటోని - సవ్యసాచి లాంటి డిజాస్టర్స్ తరువాత రిలీజ్ చేస్తున్న చిత్రం కావడంతో వీరికి కూడా సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. ఇక హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్ - నివేత పేతురేజ్ చిత్రలహరితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు.
సునీల్ కూడా సినిమా కెరీర్ కి యూ టర్న్ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఇంతమంది భవిష్యత్తులు మార్చాల్సిన చిత్రలహరి ఈ నెల 12 రిలీజయ్యి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.