Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ అందరి హృదయాలని దోచుకుంటుంది. ఇగోలతో దగ్గర కాలేకపోతున్న భార్యాభర్తల కథ ఇది. ఇక ఈరోజు మార్చి 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో నా ఫోన్ సైలెంట్ లో పెట్టింది ఎవరు అని కోపంగా అడుగుతుంది వేద. నేనే సైలెంట్ లో పెట్టాను నువ్వు బాగా అలసిపోయి పడుకున్నావు కదా డిస్టబెన్స్ అని నేను సైలెంట్ లో పెట్టాను అంటాడు యష్. నాకు ఒక క్లినిక్ ఉంది, అక్కడ నేను 24/7 అవైలబిలిటీలో ఉండాలి. ఇవన్నీ తెలిసి కూడా మీరు సైలెంట్లో ఎలా పెడతారు.ఒక పాపని 103 ఫీవర్ తో హాస్పిటల్ తీసుకువచ్చింది 20 సార్లు ఫోన్ చేశారు.

ఆ పాపకి ఏమైనా అయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటుంది వేద. సారీ అంటాడు యష్. అదే సారీ నేను ఆవిడకి చెప్తే ఇంత ఈర్రెస్పాన్సిబుల్ డాక్టర్ మొహం నేను లైఫ్ లో చూడను అన్నారు. ఒక డాక్టర్ గా ఇంతకంటే షేమ్ ఏమైనా ఉంటుందా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద. కారులో వెళ్తున్న వేద ఏంటిది ఎన్నాళ్ళని ఓపిక పట్టేది, ఈ గొడవ చిలికి చిలికి గాలి వాన అవుతుందా.

 తెగేవరకు లాక్కూడదని అని తెలుసు కానీ ఎన్నాళ్ళని భరించేది అనుకుంటుంది. అదే సమయంలో యష్ కూడా ఆలోచనలో పడతాడు. ఏం చేద్దామనుకున్నా రివర్స్లో అవుతుందేంటి ఒక తప్పు దిద్దుకునే లోపు మరో తప్పు జరిగిపోతుంది. వేదకి దగ్గరవుదాం అనుకున్న కొద్ది దూరమైపోతున్నాను ఎన్నాళ్ళని భరించేది,రోజురోజుకీ గొడవలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటాడు యష్.

మరోవైపు మాళవిక విషయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు అందుకే నిన్ను అభినందిస్తున్నాను అంటుంది చిత్ర. నేను తనని ఇష్టపడే ఇంట్లోకి తీసుకురాలేదు అన్నయ్య వదిన చెప్పారని తీసుకొచ్చాను అంటాడు వసంత్. ఏ ఆడపిల్ల అయినా తన పార్ట్నర్ లో మెచ్యూరిటీ ఉండాలని కోరుకుంటుంది అదృష్టం కొద్ది నీలో అలాంటి మెచ్యూరిటీ ఉంది అంటుంది చిత్ర.

తనని నేను ఎంత వద్దు అనుకున్నా తప్పదు ఎంతైనా తోడబుట్టినది కదా నా చేతులతోనే పెళ్లి చేసి వెనక్కి పంపిస్తాను కానీ ఆ సమయంలో నువ్వు కూడా నాతో అసోసియేట్ అవ్వాలి కదా. ఒకసారి ఇంటికి వచ్చి బాగుంటుంది అంటాడు వసంత్. తప్పకుండా వచ్చి మాళవికని కలుస్తాను అంటుంది చిత్ర. ఆనందంగా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు వసంత్.

 తప్పకుండా వస్తాను వసంత్ ఈ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటున్నావు జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను మాళవిక ఎలాంటిదైనాప్పటికీ ఆ అభిమన్యు చేతిలో బలవ్వకూడదు. అందుకు నేను చేయవలసింది నేను చేస్తాను అనుకుంటుంది చిత్ర. మరోవైపు వేద కి సారీ చెప్తాడు యష్. నీ ఫోన్ సైలెంట్ లో పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటాడు.

 గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందే నేను ఒక పాప హై ఫీవర్ తో వస్తే తనకి ట్రీట్మెంట్ చేయలేకపోయాను, డాక్టర్ గా ఫెయిలయ్యను. మీ సారీకో దండం మీకో దండం మీ ఈగో తో మీ ఆటిట్యూడ్ తో విసిగిపోయాను. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండవలసింది అది మన ఇద్దరి మధ్య అసలు లేదు. నేను మాత్రం ఎంతకాలం ఓపిక పడతాను నావల్ల కావడం లేదు అంటుంది వేద.

ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, నావల్ల తప్పు జరిగింది అని ఒప్పుకుంటున్నాను కదా ఎందుకంత ఓవర్ ఎగ్జిట్ అవుతున్నావు అంటాడు యష్. మీలాగా ఎవరు తప్పుల్ని చేస్తూ పోరు అంటుంది వేద. మీరే నన్ను వదిలేయండి అంటుంది వేద. బ్రతిమాలుతున్న కొద్దీ బిగుసుకుపోతున్నావేంటి బుద్ధి లేకుండా అంటాడు యష్. ఈ పిచ్చి కోపమే మీకు వద్దనేది అంటుంది వేద.

 ముందు నువ్వు భర్తని గౌరవించడం నేర్చుకో ఏదో పెద్ద తప్పు చేసినట్లు అందరి ముందు అలా అరిచేసావు అంటాడు యష్. మీరు కూడా భార్యని గౌరవించండి అంటుంది వేద. అహంకారమా అంటాడు యష్. ఆత్మ అభిమానం అంటుంది వేద. అర్థం చేసుకోలేని నీకు నా భార్యగా ఉండే అర్హత లేదు అంటాడు యష్. బాధ్యతలే తెలియని మీకు నా భర్తగా ఉండే హక్కు లేదు అంటుంది వేద.

 అయితే విడిపోదాం అనుకుంటారు ఇద్దరూ. కంగారు పడి నిద్రలేచిన సులోచన విడాకులు ఇవ్వద్దు అంటూ కేకలు పెడుతుంది. ఆ కేకలకి నిద్రలేచిన శర్మ ఏం జరిగింది అంటూ కంగారుగా అడుగుతాడు. అల్లుడు గారికి మన అమ్మాయి మీద కోపం వచ్చింది విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు, మనం వెళ్లి అల్లుడు గారితో మాట్లాడదాం పదండి అంటూ కంగారుగా చెప్తుంది సులోచన.

సులోచన ఇప్పుడు తెల్లవారుజామున 4 అయింది ఏం మాట్లాడుతున్నావ్ కల గాని వచ్చిందా అంటాడు శర్మ. అవునండి పీడకల అంటుంది సులోచన. పొద్దున లేచి నా కూతురు కాపురాన్ని కాపాడమంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది సులోచన. బయటికి వచ్చేసరికి భర్త పేపర్ చదివితే ఉంటాడు అతని దగ్గర పేపర్ తీసుకొని రాశి ఫలాలు చూసి కంగారు పడుతుంది.

 ఏమైంది అంటాడు శర్మ. నేను భయపడినట్లే రాశి ఫలాల్లో కూడా రాసి ఉంది భార్య భర్తల మధ్య కలహాలు, వైవాహిక జీవితంలో చెడు పరిణామాలు అంటుంది సులోచన. నిజమేనా నువ్వు చెప్తే నాకు భయంగా ఉంది అంటాడు శర్మ. వేద విషయంలో రాశి ఫలాలు ఎప్పుడు తప్పు జరగలేదు అంటుంది సులోచన. నోములు నోచి, వ్రతాలు చేసి నా బిడ్డ జీవితాన్ని కాపాడుకుంటాను.

 ముందు నేను చేయాల్సింది ఒకటి ఉంది అంటుంది సులోచన ఏంటది అని శర్మ అడిగితే వేదాతో మాట్లాడుతాను అంటుంది. తర్వాత సీన్లో వేద దగ్గరికి వస్తుంది సులోచన. ఆమెని చూసి ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఇలా వచ్చేసావ్ అంటూ కూర్చోబెట్టుకుంటుంది వేద. అంతలోనే అక్కడికి వెళ్లి కూడా వస్తాడు. అల్లుడుగారు వచ్చారా నీతో ఏమైనా మాట్లాడారా అని సులోచన అడుగుతుంది.

లేదమ్మా ఎందుకలా అడుగుతున్నావ్ అంటుంది వేద. ఏమీ లేదు అల్లుడుగారు చాలా మంచివారు నువ్వంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్ అంటుంది వేద. నువ్వు మా అందరి ముందు అల్లుడు గారిని ఎందుకు అలా అరిచావు ఆయన చిన్న బుచ్చుకున్నారేమో అంటుంది సులోచన. నాక్కూడా అలాగే అనిపిస్తుందమ్మా.

 తప్పు చేశానేమో, అయినా ఆయన కూడా ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడటం ఏమీ బాగోలేదు కేవలం బ్రేస్లెట్ కోసం పెద్ద డిస్కషన్ పెట్టారు అవసరమా అంటుంది వేద. అల్లుడుగారు చెడ్డవారు కాదు, భరించవలసింది భర్త కాదు భార్య. తప్పు ఒప్పు మంచి చెడ్డ అని మనసులో పెట్టుకొని భరించవలసింది భార్య, భార్యకి మొదటి బిడ్డ అంటుంది సులోచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి వచ్చాను.

 మీ దాంపత్యంలో ఏవైనా గొడవలు ఉంటే తీరిపోతాయి అంటూ ప్రసాదాన్ని కూతురికిస్తుంది సులోచన. రాత్రి పడుకునేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకొని పడుకో అంతా శుభమే జరుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సులోచన. ఈ మాటలన్నీ వింటున్న విని మా సులోచన వెళ్లిపోయిన తర్వాత వేద దగ్గరికి వస్తాడు. ఏంటి విన్ని సడన్ సర్ప్రైజ్ అంటుంది వేద.

 ఏం లేదు ఇటువైపుగా వెళుతూ నిన్ను చూసుకోవాలని వచ్చాను అంటాడు విన్ని. ఇప్పుడే అమ్మ కూడా వచ్చింది అంటుంది వేద. అవును చూశాను ఏదో క్లాస్ పీకుతున్నట్లుగా ఉన్నారు అంటాడు విన్ని. మనసుల్ని హర్ట్ చేయకూడదు కదా అంటుంది వేద. మీ ఆయన సంగతి తెలిసిందే కదా వదిలేయ్ అంటాడు విన్ని. నేను మా ఆయన గురించి మాట్లాడట్లేదు నా గురించి మాట్లాడుతున్నాను అంటుంది వేద.

ఒక్కసారిగా సీరియస్ గా అయిపోతాడు విన్ని. అమ్మ చెప్పినట్లు నేను ఆయన్ని బాధ పెట్టకుండా ఉండాల్సింది అంటుంది వేద. మీ అమ్మ పాతకాలం మనిషి పాత కబుర్లే చెప్తుంటుంది పట్టించుకోవద్దు అంటాడు విన్ని. పాతతరమైనా,కొత్త తరమైనా భర్త భర్తే,కాపురం కాపురమే అంటుంది వేద. ఒక వైల్డ్ భర్తని వెనకేసుకురావడం అంత అవసరమా.

 అణిగిమణిగి కాపరం చేయడం అంత అవసరమా, మొగుడి యాటిట్యూడ్ని భరిస్తూ బ్రతికుండడం అవసరమా అంటాడు విన్ని. నేను నీ దగ్గర ఒక రహస్యం దాచాను అది ఏంటో తెలుసా అంటూ ఇలా చెప్తుంది వేద. చాలా ఏళ్ల క్రితం నీ మీద చాలా కోపం వచ్చింది, ఫ్రెండ్షిప్ కటీఫ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా నా అనుకుంటే అపోహలు, అపార్ధాలు ఉండవు అని.

ఆ మాటలు విని అప్పుడు నిన్ను క్షమించిన దాన్ని, ఇప్పుడు నా భర్తని క్షమించలేనా, తప్పు చేయకపోతే భర్త ఎలా అవుతాడు, తమాయించుకోకపోతే భార్య ఎలా అవుతుంది అంటుంది వేద. ఇప్పుడు నా మనసుకి చాలా హాయిగా ఉంది అంటూ యష్ దగ్గరికి బయలుదేరుతుంది వేద. తను వెళ్ళిపోయిన తరువాత అలా ఎప్పటికీ జరగనివ్వను హస్బెండ్ అనే పదాన్ని నీ లైఫ్ నుంచి డిలీట్ చేస్తాను అనుకుంటాడు విన్ని. తరువాయి భాగంలో నేను ఖుషికి అమ్మని మాత్రమే కాదు ఆయనకి భార్యని కూడా అనుకుంటుంది వేద. యష్ రాగానే వెళ్లి అతన్ని హత్తుకుంటుంది.