పవన్ అజ్ఞాతవాసి ఆడియో ఈవెెంట్ కు చిరు రావట్లేదా?

First Published 13, Dec 2017, 11:59 AM IST
chiru to be chief guest for pawan agnyaathavaasi audio release
Highlights
  • పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి
  • సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల
  • ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. వచ్చే వారం ఈ చిత్ర ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో పవన్‌ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే అన్నయ్య చిరంజీవి గురించి రాజకీయపార్టీ జనసేన మీటింగుల్లో తన ప్రేమను వ్యక్తంచేసిన పవన్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకకు కూడా వస్తే బాగుంటుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 

మరోవైపు చిరు ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. చిత్రీకరణతో బిజీగా ఉండడంతో చిరు ఆడియో వేడుకకు రాలేరని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

 

‘అజ్ఞాతవాసి’ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. అనిరుథ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. డిసెంబర్ 16న చిత్ర టీజర్‌ను విడుదల చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2018 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

loader