మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సినీ ప్రముఖులు మరియు రాజకీయవేత్తలు ఆయనకు బెస్ట్ విషెష్ చెప్పారు. ఈ లిస్ట్ లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవికి జగన్ 'పద్మభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని తెలిపారు. 

జగన్ విషెష్ కి చిరంజీవి స్పందించారు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. దీనితో జగన్ మరియు చిరంజీవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయంగా జగన్ కి చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఐతే చిరంజీవి మాత్రం జగన్ కి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించిన సంగతి తెలిసిందే. 

ఇక చిరంజీవి బర్త్ డే కానుకగా నిన్న విడుదలై ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి లుక్ అండ్ పోస్టర్ థీమ్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్  పోస్టర్ తోనే కొరటాల శివ మూవీపై భారీ హైప్ తెచ్చారు. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా ఉన్నారు.