'ఖైదీ నంబర్‌ 150'తో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద కుమ్మేశాడు. ఖైదీ చిత్రంతో వంద కోట్ల షేర్‌ సాధించి రికార్డు నెలకొల్పిన మెగా స్టార్  ఈ చిత్రంలో నటించినందుకు తన వాటాగా తక్కువేమీ తీసుకోలేదు. చిరు తీసుకున్న రెమ్యునరేషన్ చూస్తే హవాక్కవ్వాల్సిందే. నిర్మాత తనయుడు రామ్ చరణే అయినా... పద్ధతిగా హీరోకు ఇవ్వాల్సిన వాటా తాలూకు రెమ్యునరేషన్ అప్పగించాడట. ఇంతకీ మెగాస్టార్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...

 

ఖైదీ లాభాల్లో అరవై శాతం వాటాని చిరంజీవి పారితోషికంగా ఇవ్వాలని చరణ్‌ ముందే డిసైడ్‌ అయ్యాడట. ఖైదీ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి నిర్మాణ వ్యయం యాభై రెండు కోట్లు కాగా, థియేట్రికల్‌ బిజినెస్‌, శాటిలైట్‌ రైట్స్‌, వీడియో/ఆడియో రైట్స్‌ రూపంలో మొత్తం నూట అయిదు కోట్లు వచ్చాయి. అంటే లాభం యాభై మూడు కోట్లు వచ్చింది. ఇందులో అరవై శాతం, అంటే ముప్పయ్‌ ఒక్క కోట్ల ఎనభై లక్షలు చిరంజీవికి చరణ్‌ ఇచ్చేసాడట. చరణ్‌కి ఈ చిత్రంతో మిగిలిన నికర లాభం అక్షరాలా ఇరవై ఒక్క కోట్ల ఇరవై లక్షలు.

 

ఇక దర్శకుడిగా వినాయక్‌కి అతని మార్కెట్‌కి తగ్గ రేంజ్ లో ఎనిమిది కోట్లు చెల్లించారట. తదుపరి బెస్ట్‌ రెమ్యూనరేషన్‌ అందుకున్న వారిలో కాజల్, దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు వున్నారట. ఇక ఖైదీ సినిమా కొన్నవాళ్లు కూడా బాగానే లాభపడ్డారు.