Asianet News TeluguAsianet News Telugu

రజనీకి చిరు, మోహన్‌బాబు, పవన్‌, వెంకీ, మహేష్‌, బోనీ కపూర్‌, రవితేజ..తారల అభినందనలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రజనీకి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడంతో సినీ పెద్దలు ఆయన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి, బోనీ కపూర్‌, రాఘవ లారెన్స్, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, లారెన్స్, ఇలా అనేక మంది తారలు రజనీకి విషెస్‌ తెలిపారు.

chiru mohanbabu pawan venky mahesh raviteja wishes to rajinikanth for dada saheb phalke award arj
Author
Hyderabad, First Published Apr 1, 2021, 3:41 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రజనీకి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడంతో సినీ పెద్దలు ఆయన్ని అభినందిస్తున్నారు. చిరంజీవి, బోనీ కపూర్‌, రాఘవ లారెన్స్, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, లారెన్స్, ఇలా అనేక మంది తారలు రజనీకి విషెస్‌ తెలిపారు. చిరంజీవి ట్వీట్‌ చేస్తూ, `నా ప్రియమైన స్నేహితుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రజనీకాంత్‌ నిజంగా ఈ అవార్డుకి అర్హులు. నా ఫ్రెండ్‌ చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయనకు దేవుడు తోడు ఉండుగాక` అని తెలిపారు చిరు.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త స్పందిస్తూ, ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించబడ్డ రజనీకాంత్‌కి అభినందనలు. మీరు నిజంగా దీనికి అర్హులు` అని తెలిపారు. 

మోహన్‌బాబు విషెస్‌ తెలియజేస్తూ, నా స్నేహితుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు. అది నా స్నేహితుడు. అతను ఇంకా చాలా పురస్కారాలకు అర్హుడు. ఆయన అవార్డు రావడం నాకు గర్వంగా ఉంది` అని చెప్పారు. 

విక్టరీ వెంకటేష్‌ స్పందిస్తూ, 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుని అందుకున్న తలైవా రజనీకాంత్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు` అని ట్వీట్‌ చేశారు.

పవన్‌ స్పందిస్తూ, విలక్షణ నటుడు రజనీకాంత్‌ గారు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన విషయం నాకు సంతోషాన్నిచ్చింది. ఆయనకు నా తరపున, జనసేన పక్షాన శుభాభినందనలు. తమిళ ప్రేక్షకులను గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తున్న రజనీకాంత్‌గారు ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హులు. తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్నీ దక్కించుకున్నారాయన. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. దాదాపు ముప్పై ఏళ్ల కిందట అన్నయ్య చిరంజీవి గారితో కలిసి నటించిన `బందిపోటు సింహం`, `కాళీ` సినిమాలు ఇప్పటికీ నాకు గుర్తే. రజనీకాంత్‌గారు మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తూ అలరించాలని ఆకాంక్షిస్తున్నా` అని పవన్‌ పేర్కొన్నారు. 

మహేష్‌బాబు ట్వీట్‌ చేస్తూ, ప్రతిష్టాత్మక అవార్డుని అందుకున్న రజనీకాంత్‌కి అభినందనలు. సినిమాకి మీ సహకారం అసమానమైనది. నిజంగా మీరు మాకు స్ఫూర్తి` అని చెప్పారు.  

రాఘవ లారెన్స్ చెబుతూ, `తలైవా రజనీకాంత్‌కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం దక్కడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని ప్రశంసించే ఏజ్‌ కాదు నాది. ఆయన గొప్పతనం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. గురువా శరణం` అని చెప్పారు.

అలాగే రవితేజ, మంచు విష్ణు, నివేదా థామస్‌, ఖుష్బు, రాధికా శరత్‌ కుమార్‌ వంటి వారు విషెస్‌ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios