తెలంగాణ రాష్ట్ర సాధకుడు,  తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అవిశ్రాంతంగా పోరాడారని ఈ సందర్భంగా తారలు కొనియాడారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కి మద్దతు పలికారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్‌ తెలిపారు. `పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్‌గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ గారు చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ కోటి వృక్షార్చనలో భాగస్వాములమై మొక్కలు నాటటం మనం కేసీఆర్‌కి ఇచ్చే కానుక. అందరం మొక్కలు నాటుదాం. వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం` అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

మహేష్‌ బాబు చెబుతూ, `కేసీఆర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వం మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నా. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. 

Scroll to load tweet…

విజయ్‌ దేవరకొండ చెబుతూ, `మీరు ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, నీటి కోసం, కరెంట్‌ కోసం, పచ్చదనం కోసం, అభివృద్ధి కోసం పోరాడారు. నేను మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నా. మీరు మా కోసం పోరాడుతూ, రాష్ట్రాన్ని నడిపించాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. 

Scroll to load tweet…

హాట్‌ యాంకర్‌ అనసూయ కూడా విషెస్‌ చెప్పారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఉండాలని తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…