హైదరాబాద్: ఆగష్టు నెల వచ్చిందంటే చాలు మెగాస్టార్ అభిమానులకు పండుగ వచ్చినట్లే. ఎందుకంటే ఆగష్టు 22న చిరు బర్త్ డే కాబట్టి. ఈ సందర్భంగా చిరంజీవి చిన్ననాటి మధురజ్ఞాపకాలను కుటుంబ సభ్యులు గుర్తు చేస్తూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో చిరంజీవి బర్త్ డే ఉంటుండగా ఆయన తల్లి అంజనాదేవీ చిరంజీవికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 

చిరంజీవి అన్నప్రాసన రోజున కత్తిపట్టుకున్నాడని చెప్పారు. అలా కత్తిపట్టుకున్నప్పుడు తాను ఆశ్చర్యపడ్డానని తెలిపారు. అప్పుడు పట్టుకున్న కత్తి ఖైదీ నంబర్ 150 వరకు వదల్లేదని....మరోమారు సైరాకు కూడా పట్టుకున్నాడని నవ్వుతూ చెప్పుకొచ్చారు.