మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకిందని అధికారిక ప్రకటన చేయడం టాలీవుడ్ వర్గాలతో పాటు, ఆయన ఫ్యాన్స్ ని దిగ్బ్రాంతికి గురి చేసింది. తనకు ఎటువంటి లక్షణాలు లేకున్నప్పటికీ కరోనా పాజిటివ్ అని తేలిందని, గత ఐదురోజులుగా తనను కలిగిన ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్స్ చేయించుకోవాలని, చిరంజీవి అందరికీ విజ్ఞప్తి చేశారు. అలాగే తన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని, ఆందోళన వద్దని ఆయన తెలియజేశారు. 


ఇటీవల వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన చెక్స్ ని సీఎం కెసిఆర్ కి అందించడానికి చిరంజీవి, నాగార్జున ఆయన్ని కలవడం జరిగింది. ఈ సమయంలో నాగార్జునతో పాటు కేసీఆర్ తో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఒకవేళ నాగార్జునకు కరోనా సోకిన నేపథ్యంలో ఆ ప్రభావం షోపై పడే అవకాశం ఉంది. 

పొరపాటున  నాగార్జునకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఆయన కొన్నిరోజులు క్వారంటైన్ కావలసి ఉంటుంది. దాదాపు రెండు వారాలు ఆయన షోకి హాజరయ్యే అవకాశం ఉండదు. ఇప్పటికే షో టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నాగార్జునకు కరోనా సోకితే అది షోపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నాగార్జున ఈ మహమ్మారి బారిన పడకూదని అటు నిర్వాహకులు , ఇటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. నిజానికి నేటి నుండి ఆచార్య షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అనుకోని ఈ సంఘటన వలన మరికొంత కాలం ఆచార్య షూటింగ్ వాయిదా పడనుంది.