ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఒకటే టాపిక్... చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu)ఒకే వేదికమీదకు వస్తే.. ఏంజరుగుతుంది.. మాటల తూటాలు పెలుతాయా..? హగ్గులు,పొగడ్తలతో షాకిస్తారా..? అసలు ఈరోజు సమావేశంలో ఏం జరగబోతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా ఒకటే టాపిక్... చిరంజీవి(Chiranjeevi), మోహన్ బాబు (Mohan Babu)ఒకే వేదికమీదకు వస్తే.. ఏంజరుగుతుంది.. మాటల తూటాలు పెలుతాయా..? హగ్గులు,పొగడ్తలతో షాకిస్తారా..? అసలు ఈరోజు సమావేశంలో ఏం జరగబోతోంది.
ఎట్టకేలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ముహుర్తం పిక్స్ అయ్యింది. టాలీవుడ్ ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ఆదివారం కీలక సమావేశం జరుగనుంది. దీనికి 24 క్రాఫ్టులకు చెందిన సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. గత కొంత కాలంగా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు,ఇండస్ట్రీకి సంబంధించిన జీవోలు , సినీ కార్మికుల సంక్షేమం లాంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లోని కల్చరల్ హాల్ లో జరగబోతున్న ఈ సమావేశం గురించి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీ అంతా జరుగుతున్న చర్చ ఏంటంటే.. ఈ వేదికపై చిరంజీవి, మోహన్ బాబు చాలా కాలం తరువాత కలవబోతుండటం. మరి వీరిద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ ఇద్దరు కలిస్తే మాటల తూటాలు అయినా పేలుతాయి.. లేక ఆత్మీయ ఆలింగనాలు అయినా జరుగుతాయి. ఈ సమావేశంలో ఎం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
ఎప్పుడో మా సమస్యల గురించి జరిగిన సమావేశంలో చివరి సారిగా వేదిక పంచుకున్నారు ఈ స్టార్ హీరోలు. అప్పుడు హీరో రాజశేఖర్ ఇష్యూ కూడా జరగడం... ఈ ఇద్దరు స్టార్లు ఒకే మాట మీద ఉండి... సానుకూల వాతావరణం సృష్టిచడంతో .. వీరు కలిసి పోయారు అని అనుకున్నారంతా. కాని ఈ మధ్య ఇండస్ట్రీ సమస్యలు.. ప్రభుత్వాలతో చర్చలకు సబంధించిన వ్యవహారాలతో వీరి మధ్య మళ్లీ ముదిరినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్(Chiranjeevi) ఈ విషయాలలో సైలెంట్ గా ఉన్నారు. ఆచి తూచి స్పందిస్తున్నారు. కాని మోహన బాబు ఫ్యామిలీ మాత్రం ఇండైరెక్ట్ గా.. సెటైరికల్ గా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొన్న జరిగిన ఇండస్ట్రీ పెద్దలు.. జగన్ మీటింగ్ పై కూడా ఇదే రచ్చ కొనసాగింది. ఎవరి ఇలా చేస్తున్నారో తెలుసంటూ.. మోహన్ బాబు, విష్ణు స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. మరో వైపు మెగాస్టార్.. నాకు ఈ పెద్దరికం వద్దు.. ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే ముందు ఉంటాను అంటూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు.
ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి సంబంధించి భారీ సమేవేశం జరగబోతోంది. అందులో చిరంజీవి, మోహన్ బాబు(Mohan Babu) తప్పకుండా ఉంటారు. వీరు ఈ సమావేశంలో ఎలా వ్యవహరిస్తారు అనేది అంతటా చర్చనీయాంశం అవుతుంది. మోహన్ బాబు మనసులో మాట బయట పెడతారా.. Chiranjeevi ఎలా వ్యవహరిస్తారు...? అసలు వీరిద్దరు సమావేశాలనికి వస్తారా..? ఎవరైనా డుమ్మా కొడతారా అనేది చూడాలి.
