ఆచార్య రిజల్ట్ తో తీవ్ర నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశలన్నీ 'గాడ్ ఫాదర్' పైనే పెట్టుకున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది.
ఆచార్య రిజల్ట్ తో తీవ్ర నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశలన్నీ 'గాడ్ ఫాదర్' పైనే పెట్టుకున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిరంజీవి త్వరలో ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సమాచారం మేరకు గాడ్ ఫాదర్ ఫైనల్ కట్ పూర్తయి కాపీ కూడా రెడీ అయ్యిందట. ఫైనల్ కాపీని మెగాస్టార్ వీక్షించినట్లు తెలుస్తోంది. ఫైనల్ కాపీపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారో అని చిత్ర యూనిట్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారట. చిరు తుది కాపీ చూసిన అనంతరం మూవీ అద్భుతంగా గ్రిప్పింగ్ గా ఉందని దర్శకుడు మోహన్ రాజాని ప్రశంసించినట్లు తెలుస్తోంది.
ఎలాంటి అవుట్ పుట్ కోరుకున్నామో సరిగా అలాగే సినిమాని రాబట్టినట్లు మోహన్ రాజా వర్క్ ని అభినదించారట. అక్టోబర్ 5న బాక్సాఫీస్ ని ఢీ కొట్టడానికి ఈ చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయని ఇక ప్రొమోషన్స్ పై ద్రుష్టి పెట్టాలని చిత్ర యూనిట్ కి సూచించారట.
గాడ్ ఫాదర్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ కామియో రోల్ లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సునీల్, సత్యదేవ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
