దర్శకుడు కొరటాల శివ ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడానికి ట్రై చేశారు. ఆచార్య మూవీ ద్వారా రెండు అద్భుతమైన పాత్రలలో చిరంజీవి, రామ్ చరణ్ లను చూపించే ప్రయత్నం చేశారు. గతంలో చిరు, చరణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించినప్పటికీ అవి కేవలం క్యామియో పాత్రలు మాత్రమే. మగధీర, బ్రూస్ లీ చిత్రాలలో చిరంజీవి తళుక్కన మెరిసి మెగా ఫ్యాన్స్ కి సంతోషం పంచారు. కొరటాల మాత్రం ఓ పూర్తి స్థాయి పాత్రను చరణ్ కోసం ఆచార్యలో డిజైన్ చేయడం జరిగింది. దాదాపు అరగంట నిడివి కలిగిన కీలక పాత్ర కోసం చరణ్ ని కొరటాల అనుకున్నారు. 

లాక్ డౌన్ కారణంగా అన్ని చిత్రాల షెడ్యూల్స్ మారిపోవడంతో కొరటాల శివ కలలకు కళ్లెం పడింది. మొదట్లో ఆర్ ఆర్ ఆర్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆచార్య షూట్ లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇచ్చారు. ఐతే ఇప్పుడు ఆచార్య మూవీలో చరణ్ నటించడం పూర్తిగా అసాధ్యమే. ఆర్ ఆర్ ఆర్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్న రాజమౌళి, చరణ్ ని అసలు వదిలే ఛాన్స్ లేదు.కాబట్టి కొరటాల దగ్గర ఉన్న మరో ఛాయిస్ సూపర్ స్టార్ మహేష్. గతంలో కొరటాల శివ మహేష్ తో చరణ్ చేసే వీలు ఉంటుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారట. ఒక వేళ చరణ్ చేయని పక్షంలో నేను చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. 

ఐతే ఇప్పుడు మహేష్ దర్శకుడు పరుశురామ్ తో సర్కారు వారి పాట మూవీ ప్రకటించారు. వీలైతే సెప్టెంబర్ నుండి షూట్ స్టార్ట్ చేయాలనేది మహేష్ ప్లాన్. అప్పుడు కొరటాలకు హామీ ఇచ్చిన మహేష్ ఇప్పుడు ఆ పాత్ర చేస్తాడని నమ్మకం లేదు. దీనితో చిరంజీవి, కొరటాల శివ మహేష్ ని కన్విన్స్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి మహేష్ కనుక ఒప్పుకుంటే ఇది భారీ మల్టీస్టారర్ కావడం ఖాయం. అలాగే ఆచార్యకు విపరీతమైన హైప్ వచ్చి చేరుతుంది. మరి చూద్దాం మహేష్ చివరికి ఏమి చేస్తాడో..!