సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా జరపబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ చేస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడు పెంచారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా జరపబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జనవరి 8న విశాఖపట్నం RK బీచ్ లో లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా బాలకృష్ణ రాబోతున్నాడు అని ఒక వార్త సినీవర్గాల్లో వినిపిస్తుంది. ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, పాటలు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో 40 నిమిషాల పాటు రవితేజ క్యారెక్టర్ ఉన్నట్లు సమాచారం. కాగా అంతకుముందు విడుదల చేసిన టైటిల్ టీజర్ తో పాటు “బాస్ పార్టీ” సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. బాబీ చాలా ఉర మాస్ లుక్ లో చిరుని చూపిస్తున్నారు. అప్పట్లో ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు టైములో ఉన్న రీతిలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. సంక్రాంతి రేస్ లో భాగంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఒక రోజు ముందు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత చిరు… బాలయ్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరిది పై చేయి అవుద్ది అన్నది ఆసక్తికరంగా ఉంది.
