ఆదివారం చిరంజీవి భార్య సురేఖతో కలిసి శబరిమలని టెంపుల్‌ని సందర్శించారు. కేరలాలోని శబరిమల అయ్యప్ప టెంపుల్‌ని మెగాస్టార్‌ దంపతులు సందర్శించి స్వామివారి దర్శనం పొందారు. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి టికెట్ల రేట్ల విషయంలో కీలక భూమిక పోషించి సమస్య పరిష్కార మార్గానికి బాటలు వేశారు. అనంతరం వరుసగా దైవ దర్శనాలతో బిజీగా గడుపుతున్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో ముచ్చింతల్‌లోని కొత్తగా నిర్మించిన శ్రీ రామానుజ సమతామూర్తి సన్నిధిని సందర్శించారు. సతీమణి సురేఖతోపాటు చిరంజీవి ఈ వేడుకలో పాల్గొని చిన జీయర్‌ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అందులో భాగంగా సమతా మూర్తి ఆశ్రమంలో ఉన్న 108 దివ్య దేశాల దేవాలయాలను కూడా చిరంజీవి దర్శించుకున్నారు. 

ఆదివారం Chiranjeevi భార్య సురేఖతో కలిసి శబరిమలని టెంపుల్‌ని సందర్శించారు. కేరలాలోని శబరిమల అయ్యప్ప టెంపుల్‌ని మెగాస్టార్‌ దంపతులు సందర్శించి స్వామివారి దర్శనం పొందారు. పూజారుల ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఓ నోట్‌ని కూడా షేర్‌ చేసుకున్నారు చిరంజీవి. 

Scroll to load tweet…

ఇందులో చిరంజీవి చెబుతూ, `చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే భక్తుల రద్దీ,అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లవలిసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార పోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్‌, ఫీనిక్స్ గోపీల కుటుబాల తోడు మంచి అనుభూతినిచ్చింది` అని పేర్కొన్నారు చిరంజీవి. 

చిరంజీవి కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అధికారికంగా ఐదు ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పారు. అందులో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరోవైపు ఆయన, రామ్‌చరణ్‌కలిసి నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఏప్రిల్‌ 29న థియేటర్‌లోకి రాబోతుంది. దీంతోపాటు `గాఢ్‌ఫాదర్‌`, `భోళాశంకర్‌`, అలాగే `మెగా154` చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్యతో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. 

మరోవైపు టాలీవుడ్‌ పెద్దగానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఏపీ స్టేట్‌లో టికెట్ రేట్ల ఇష్యూ ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో దాన్ని పరిష్కరించే విషయంలో ముందుండి కీలకంగా వ్యవహరించి ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకున్నారు. అయితే చిరంజీవి బృందంతో చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వం మరోసారి ఈ నెల 17న చర్చలు జరుపబోతుంది. ఈ చర్చలతో టికెట్ల రేట్ల ఇష్యూ, ఐదు షోలు, షూటింగ్‌ సమస్యలు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.