ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తున్న ఆచార్య సినిమా తరువాత చిరంజీవి 'లూసిఫెర్' తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించటానికి రంగం సిద్దం చేస్తున్న  చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమా, 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ దక్కించుకున్నాడు. చిరంజీవి హీరోగా చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడుగా వినాయక్ .. హరీశ్ శంకర్ ల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా 'సాహో' దర్శకుడు సుజీత్ ని ఫైనలైజ్ చేసారు. 

ఈ విషయమై చిరంజీవి మాట్లాడుతూ...“నా పర్శనాలిటీకు లూసిఫర్ ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సుజీత్ అయితే బాగుంటాడని రామ్ చరణ్ నాకు సజెస్ట్ చేసారు. దాంతో సుజీత్ ఒరిజనల్ స్క్రిప్టులో కొన్ని మార్పులు సజెస్ట్ చేసారు. మేము వీడియోకాల్స్ లో ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నాము,” అని తాజాగా ఫోన్ లో ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. 

ఇక 'సాహో' రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, ప్రభాస్ ను సుజీత్ చాలా స్టైలిష్ గా చూపించాడు. భారీ సినిమానే అయినా బాగా డీల్ చేశాడు. అందువలన సుజీత్ పై రామ్ చరణ్ దృష్టిపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ తో సినిమా కోసం సుజీత్ ప్రయత్నిస్తే.. అతడికి లూసిఫర్ రీమేక్ ఆఫర్ ఇచ్చాడు చరణ్. చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేసిపెట్టాలని కోరాడు. దీంతో సుజీత్ ఆ మూవీకి తన మార్క్ స్టయిల్ యాడ్ చేసే పనిలో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు.