Asianet News TeluguAsianet News Telugu

నితిన్ డైరక్టర్ తో చిరంజీవి సినిమా ఖరారు,నిర్మాత ఎవరంటే...

 ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

Chiranjeevi Venky Kudumula film confirmed
Author
Hyderabad, First Published Nov 22, 2021, 7:19 AM IST

నితిన్ తో  ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల తర్వాత ప్రాజెక్టు ఏమిటనేది ఇప్పటిదాకా ప్రకటన రాలేదు. ఆయన చాలా మంది పెద్ద హీరోల చుట్టూ కథలు వినిపిస్తూ తిరుగుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపించింది. అయితే ఎక్కడా ఓకే కాలేదు. కానీ తాజాగా ఆయన చెప్పిన స్టోరీ లైన్ కు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారట. సినిమా చేద్దామని మాట ఇచ్చారట.

వివరాల్లోకి వెళితే.. చిరంజీవి వరుస  సినిమాలు కమిట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్‌’, ‘బోళాశంకర్‌’, దర్శకుడు బాబీతో సినిమాలు కమిట్‌ అయిన చిరంజీవి తాజాగా మరో కొత్త సినిమా అంగీకరించారు. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆల్రెడీ చిరంజీవికి వెంకీ స్టోరీలైన్‌ వినిపించారట. ఈ సినిమా గురించి త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 
 Also read Kartikeya Wedding: గ్రాండ్‌గా కార్తికేయ పెళ్లి వేడుక.. చిరంజీవి, పాయల్‌ రాజ్‌పుత్‌, ప్రముఖుల సందడి (ఫోటోలు)
ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రం ఇపాటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే చిరు నుంచి కొత్త సినిమా లేక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో స్పీడ్‌ పెంచారు. వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ ఫ్యాన్స్‌ను ఆనంద పరుస్తున్నారు. చిరు ఇప్పటికే ఆచార్య చిత్రంతో పాటు.. ‘గాడ్‌ఫాదర్‌’, ‘బోళాశంకర్‌’, దర్శకుడు బాబీతో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం చిరు ఈ  కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి.  వెంకీ కుడుముల తన జానర్ లోనే ఫన్ తో కూడిన ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథను చిరుకు వినిపించాడని, దానికి చిరు కూడా వెంటనే ఓకే చెప్పారని సమాచారం.  మరి ఇందులో ఏమేర నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also read Kaikala Satyanarayana: కైకాలను పలకరించారు... తిరిగివచ్చాక సంబరాలు చేసుకుందాం
 

Follow Us:
Download App:
  • android
  • ios