చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేరనే వార్త వెనక అసలు కథ

అజిత్‌  హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వేదాళం’. మొదట ఈ సినిమాను పవన్‌తో చేద్దామనుకున్నారు. ఆయన రాజకీయాల్లో వెళ్లిపోవడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం పవన్‌ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ‘వేదాళం’ చిరు దగ్గర ఆగింది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ఈ రీమేక్ సినిమాలో నటించనున్నారు.  ‘వేదాళం’ రీమేక్‌ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మెహర్‌ రమేశ్‌ కథను సిద్ధం చేసారు.  ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌ చిత్రాల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందన్నది అభిమానులకు అర్దం కాలేదు. కానీ వేదాళం రీమేక్ మొదట ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.  

Chiranjeevi vedhalam remake shoot already started? jsp

మెగాస్టార్  చిరంజీవి ఇటీవల వరుస సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ ప్రారంభించారు.  ఈ నేపథ్యంలో చిరు నటించబోయే తర్వాతి చిత్రాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. ‘ఆచార్య’ తర్వాత చిరు ముందు రెండు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌లో తాను నటిస్తానని చిరు ఇప్పటికే ప్రకటించారు. ఇందులోనూ రామ్‌చరణ్‌  ఓ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ లేదా టోవినో థామస్‌ పోషించిన పాత్రల్లో ఏదో ఒకటి చేస్తారని టాక్‌.

అజిత్‌  హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వేదాళం’. మొదట ఈ సినిమాను పవన్‌తో చేద్దామనుకున్నారు. ఆయన రాజకీయాల్లో వెళ్లిపోవడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం పవన్‌ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ‘వేదాళం’ చిరు దగ్గర ఆగింది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ఈ రీమేక్ సినిమాలో నటించనున్నారు.  ‘వేదాళం’ రీమేక్‌ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మెహర్‌ రమేశ్‌ కథను సిద్ధం చేసారు.  ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌ చిత్రాల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందన్నది అభిమానులకు అర్దం కాలేదు. కానీ వేదాళం రీమేక్ మొదట ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.  

 ‘ఆచార్య‌’ అయిన వెంటనే‌… ‘వేదాళం’ రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి.  2021 మార్చిలో ‘వేదాళం’ సెట్స్‌పైకి వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది.  14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే `వేదాళం` షూటింగ్ మొద‌లైపోయింద‌ని, కొన్ని మాంటేజ్ షాట్లూ ఈ సినిమా కోసం తీసేశార‌ని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ‌. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అక్క‌డ ద‌స‌రా భారీ గా జరుగుతుంది. 

ఆ నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ కి కొన్ని మాంటేజ్ షాట్లు కావాల్సివ‌చ్చాయి. అందుకే ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా.. చిత్ర‌టీమ్ కొల‌కొత్తా వెళ్లి, అక్క‌డి ఉత్సవాల‌ను షూట్ చేసి వ‌చ్చింద‌ట‌. ఆ ఫుటేజీని.. `వేదాళం` రీమేక్‌లో వాడుకోబోతున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాలో చిరు గుండు గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు చిరు చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేష్ దాదాపు ఖాయ‌మైంది. మిగిలిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios