Asianet News TeluguAsianet News Telugu

చరణ్ కు అనుకున్న టైటిల్ తో చిరు,వశిష్ట ఫిల్మ్?


 చిరంజీవి వశిష్ట మూవీకి సంబంధించిన టైటిల్ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రం టైటిల్ ఇంతకు ముందు రామ్ చరణ్ కు అనుకున్నదే..
  

Chiranjeevi Vasishtha project gets crazy title? jsp
Author
First Published Oct 25, 2023, 10:49 AM IST


భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఆసక్తిగా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లే చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన 156 సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టి 157ను ముందుకు పెట్టారు చిరంజీవి. ఈ సినిమా దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్పుడీ చిత్రం టైటిల్ గురించిన చర్చ మొదలైంది. 

ఈ చిత్రం కథ మూడు లోకాల్లో తిరుగుతుందిట. అందుకే ముల్లోకాల వీరుడు అనే టైటిల్ మొదట అనుకున్నారట. అయితే ఆ టైటిల్ బాగున్నా ఏదో డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని  భావించారట. దాంతో  విశ్వంభర అనే టైటిల్‌ ని పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.  విశ్వంభర వినటానికి  బాగుందని, ఈ కథకు, చిరు ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. అందుకే ఈ విశ్వంభర అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయిందని సమాచారం. అయితే విశ్వంభర టైటిల్ ఇంతకు ముందు విన్నట్లు అనిపిస్తోంది కదా..

అవును ..ఇంతకు ముందు రామ్ చరణ్ చిత్రం కోసం ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. తమిళ  స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ramcharan) తో మొట్టమొదటి సారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ కెరీర్ లో ఇది 15వ చిత్రం కాగా.. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇక ఈ సినిమాకి ఇదివరకు ‘విశ్వంభర (Viswambhara) అనే టైటిల్ ని పెడదామనుకుని చివరకు గేమ్ ఛేంజర్ దగ్గర ఆగారు. ఇంగ్లీష్ లో పేరు అయితే ప్యాన్ ఇండియా టైటిల్ గా ఉంటుందని భావించారట. 

ఇక, చిరు ,వశిష్ట  మూవీని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాత పద్దతిలోనే అంటే.. మ్యూజిక్ రికార్డింగ్స్‌తో సినిమాను ప్రారంభించారట. కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా ఉండబోతోంది. దసరా సందర్భంగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు క్లాప్ కొట్టారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. నవంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేలా కనిపిస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios