జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. సినీ సెలబ్రిటీలు సైతం భారీగా వచ్చి తమ ఓట్‌ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల్లో ఓట్‌ని వినియోగించుకున్న సెలబ్రిటీగా చిరంజీవి నిలిచారు. ఆయన జూబ్లీహిల్స్ లో ఉదయం 7.30గంటల సమయంలో ఓట్‌ని వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి వచ్చి ఓట్‌ వేశారు. 

ఈ సందర్భంగా ఆయన తాను ఓట్‌ వేసినట్టుగా సింబల్‌ ఇచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కోవిడ్‌ నిబంధనల కారణంగా ఆయన మాస్క్ ధరించి వచ్చారు. కరోనా రూల్స్ ని స్టిక్ట్ గా ఫాలో అయ్యారు. ఇక మెగాస్టార్‌ తనయుడు, హీరో రామ్‌ చరణ్‌ కూడా చిరుతో కలిసి రావాల్సి ఉంది. కానీ ఆయన ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌లో ఉన్న నేపథ్యంలో మధ్యలో వచ్చి ఓట్‌ని తన సతీమణి ఉపాసనతో కలిసి ఓట్‌ వేయనున్నట్టు తెలుస్తుంది.