MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Dhanush Rejects Film: స్టార్‌ డైరెక్టర్‌ ఆఫర్‌ ని రిజెక్ట్‌ చేసిన ధనుష్‌.. అసలు కారణం ఇదే

Dhanush Rejects Film: స్టార్‌ డైరెక్టర్‌ ఆఫర్‌ ని రిజెక్ట్‌ చేసిన ధనుష్‌.. అసలు కారణం ఇదే

Dhanush Rejects Film: ధనుష్‌ కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. వరుస లైనప్‌తో బిజీగా ఉన్న ఆయన  ఓ స్టార్‌ డైరెక్టర్‌ కి నో చెప్పాడు. ఆయన సినిమా ఆఫర్‌ని తిరస్కరించడం ఇప్పుడు తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 25 2026, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ధనుష్‌ సంచలన నిర్ణయం
Image Credit : Asianet News

ధనుష్‌ సంచలన నిర్ణయం

ధనుష్‌ గతేడాది `కుబేరా` చిత్రంతో మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత `ఇడ్లీ కొట్టు`, `తేరే ఇష్క్ మెయిన్‌` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు అబ్దుల్‌ కలాం బయోపిక్‌, ఇళయరాజా బయోపిక్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ స్టార్‌ డైరెక్టర్‌కి నో చెప్పారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మణిరత్నంకి నో చెప్పిన ధనుష్‌
Image Credit : our own

మణిరత్నంకి నో చెప్పిన ధనుష్‌

 కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా తర్వాత మణిరత్నం తన తర్వాతి మెగా ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో హీరోగా నటించమని ధనుష్‌ను సంప్రదించారు. మణిరత్నం చెప్పిన కథ, పాత్ర ధనుష్‌కు బాగా నచ్చాయట. కానీ, ఒక కీలక విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదు.

Related Articles

Related image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Related image2
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
36
అడ్డొచ్చిన 'భారీ' రెమ్యూనరేషన్!
Image Credit : Asianet News

అడ్డొచ్చిన 'భారీ' రెమ్యూనరేషన్!

ఇటీవల ధనుష్ మార్కెట్ తమిళనాడుతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పెరిగింది. దీంతో తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడు. అయితే, సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, ధనుష్ అడిగినంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు మణిరత్నం టీమ్ ఒప్పుకోలేదని సమాచారం. 'మణిరత్నం సినిమాలో నటించడమే గౌరవంగా భావించే చోట, రెమ్యూనరేషన్ కోసం ఒక నేషనల్ అవార్డ్ హీరో ఛాన్స్ వదులుకోవడం కరెక్టేనా?' అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

46
 శింబు నుంచి విజయ్ సేతుపతి వరకు!
Image Credit : our own

శింబు నుంచి విజయ్ సేతుపతి వరకు!

ధనుష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక, ఈ అవకాశం నటుడు శింబు (STR) వద్దకు వెళ్లింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది కూడా సెట్‌ కాలేదు. చివరికి, ఈ ఛాన్స్ ఇప్పుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిని వరించింది. ప్రస్తుతం 'పాకెట్ నావల్' సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, ఆ సినిమా పూర్తవగానే మణిరత్నం - లైకా కాంబోలోని ఈ కొత్త ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు.

56
 సాయిపల్లవి హీరోయిన్‌
Image Credit : X

సాయిపల్లవి హీరోయిన్‌

 విజయ్ సేతుపతికి జోడీగా 'నేచురల్ స్టార్' సాయి పల్లవిని తీసుకున్నారు.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.  ధనుష్ వదులుకున్న ఈ పాత్రలో విజయ్ సేతుపతి ఎలా మెప్పిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

66
మణిరత్నం మ్యాజిక్‌ను ధనుష్ మిస్ చేసుకున్నాడా?
Image Credit : Asianet News

మణిరత్నం మ్యాజిక్‌ను ధనుష్ మిస్ చేసుకున్నాడా?

మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం కంటే ధనుష్ తన రెమ్యూనరేషన్‌కే కట్టుబడి ఉండటం కోలీవుడ్‌లో ఒక చర్చకు దారితీసింది. కొందరు ఇది ప్రొఫెషనల్ నిర్ణయమని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం 'ధనుష్ ఒక మంచి మ్యాజికల్ సినిమాను మిస్ చేసుకున్నాడు' అని అభిప్రాయపడుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image2
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image3
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved