MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Meghana Raj: అబ్బాయి పుట్టాడని డాక్టర్ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యా.. భర్త మరణంపై మేఘనా రాజ్ ఎమోషనల్

Meghana Raj: అబ్బాయి పుట్టాడని డాక్టర్ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యా.. భర్త మరణంపై మేఘనా రాజ్ ఎమోషనల్

నటి మేఘనా రాజ్ తన భర్త చిరంజీవి సర్జా అకాల మరణం, కొడుకు రాయన్ జననం సమయంలో తాను అనుభవించిన బాధ, సంతోషాన్ని తెలిపారు.  కొడుకు పుట్టినప్పుడు ఆమె సంచలన నిర్ణయం తీసుకుందట.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 25 2026, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓ వైపు భర్త మరణం, మరోవైపు కొడుకు జననం.. మేఘనా పరిస్థితి
Image Credit : X

ఓ వైపు భర్త మరణం, మరోవైపు కొడుకు జననం.. మేఘనా పరిస్థితి

కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి, కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్, ప్రస్తుతం తన కొడుకు రాయన్ ఆలనాపాలనతో సమయం గడుపుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చిరంజీవి సర్జా చనిపోవడంతో, ఆ సమయంలో ఆమె పడిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఒకవైపు బిడ్డ పుట్టబోతున్నాడన్న సంతోషం, మరోవైపు భర్త అకాల మరణం.. ఈ క్లిష్ట సమయంలో తాను అనుభవించిన బాధను ఆమె పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మనసులో చెప్పలేని వేదన బయటపెట్టిన మేఘనా రాజ్‌
Image Credit : Instagram Meghana Raj

మనసులో చెప్పలేని వేదన బయటపెట్టిన మేఘనా రాజ్‌

Rayane Mithun అనే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేఘనా రాజ్ (Meghana Raj) ఆ సమయంలో తన మానసిక వేదన గురించి మాట్లాడారు. 'నాకు అప్పుడు సీమంతం చేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ, ఇంట్లో వాళ్లు ఆ కార్యక్రమం చేశారు. అప్పుడు నేను పడిన బాధను ఎలా చెప్పను?' అని ఆమె ప్రశ్నించారు.

Related Articles

Related image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Related image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
36
 బిడ్డ ఎలా పడతాడో అన్న భయంతో గడిపాను
Image Credit : youtube/@Rayane_Mithun

బిడ్డ ఎలా పడతాడో అన్న భయంతో గడిపాను

నాలోని ఆ మానసిక సంఘర్షణ, అప్పటి నా పరిస్థితిలో బిడ్డ ఎలా పుడతాడోనని చాలా భయమేసింది. తల్లి మానసిక స్థితి కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతుంది కాబట్టి, నా బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పుట్టాలనే కోరిక తప్ప మరే ఆలోచనా నా లో లేదు. అలాంటి భయాలతో గడిపాను' అని ఆ బాధను గుర్తుచేసుకున్నారు.

46
అప్పుడే డిసైడ్ అయిపోయా-మేఘనా రాజ్‌
Image Credit : instagram/@megsraj

అప్పుడే డిసైడ్ అయిపోయా-మేఘనా రాజ్‌

రాయన్ పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. నాకు బాబు పుట్టినప్పుడు, బిడ్డను ఎత్తుకున్న డాక్టర్ 'అబ్బాయి పుట్టాడు.. పింక్ పింక్ బేబీ బాయ్' అని చెప్పారు. ఆ క్షణంలోనే నేను డిసైడ్ అయిపోయా. వీడికోసం బతకాలి, వీడికోసం జీవించాలి, సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకున్నా' అని మేఘనా చెప్పారు.

56
రెండో పెళ్లి గురించి మేఘనా రాజ్‌
Image Credit : Instagram

రెండో పెళ్లి గురించి మేఘనా రాజ్‌

ఇదే ఇంటర్వ్యూలో మేఘనా తన రెండో పెళ్లి గురించి కూడా మాట్లాడారు. 'ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలి. ఆ తోడు భర్త రూపంలోనే ఉండాలని లేదు, కానీ ఒక కంపానియన్ ఉండాలి. ఒక అబ్బాయికి అమ్మాయి తోడు అనేది నిజమే అయినా, అన్ని సందర్భాల్లోనూ అలాగే జరగాలని లేదు. కనీసం మన కష్టసుఖాలు పంచుకోవడానికైనా ఒకరు కావాలి' అని అన్నారు.
66
ఆ టైమ్‌ వచ్చినప్పుడు ఆలోచిస్తా.. రెండో పెళ్లిపై మేఘనా రాజ్‌
Image Credit : Instagram

ఆ టైమ్‌ వచ్చినప్పుడు ఆలోచిస్తా.. రెండో పెళ్లిపై మేఘనా రాజ్‌

ఈ విషయం గురించి చాలామంది నాతో మాట్లాడతారు. మరో పెళ్లి చేసుకోమని అడుగుతారు. కానీ ప్రస్తుతం మరో ప్రేమకు నేను మానసికంగా సిద్ధంగా లేను. అలా అని చేసుకోనని చెప్పడం లేదు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే, ఆ క్షణంలో ఏం చేయాలో ఆలోచిస్తాను' అని చెబుతూ, రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. రెండో పెళ్లికి రెడీ నే అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Related Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved