మళ్లీ ఇంకోటా? చిరంజీవి ఎందుకిలా చేస్తున్నాడు?

ఇక ఇప్పటికే కమిటైన  రెండు రీమేక్‌లు సరిపోవని ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఓ  వార్త మీడియోలో వినపడుతోంది.  ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో  డబ్బింగైంది. ఇక్కడ ఫరవాలేదన్నట్లుగా ఓ మోస్తరుగా ఆడింది కూడా. 

Chiranjeevi to sign his third consecutive remake? jsp

 మిగతా స్టార్స్ అంతా  లాక్ డౌన్ టైంలో  ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటే చిరంజీవి మాత్రం వరుసబెట్టి మళ్లీ రీమేక్‌ల మీద పడ్డారు. కెరీర్ లో చాలా కొత్త కథలు చేసి, ప్రయోగాత్మక సినిమాలు సైతం చేసి మెప్పించిన చిరంజీవి ఇలా చేయటం చాలామందికి మింగుడు పడటం లేదు. ఇప్పటికే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ఓకే చేసిన చిరు.. వి.వి.వినాయక్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ కోసం కూడా రంగం సిద్ధం చేశారు. ఈ రెండూ గొప్ప సినిమాలేం కాదు.  రొటీన్ మాస్ మసాలా సినిమాలే. అంతేకాదు వాటిని డైరక్ట్ చేసే డైరక్టర్స్..ఫామ్ లో ఉన్న వాళ్లు కాదు. సరే టాలెంట్ కు ఫామ్ లో ఉండటం లేకపోవటం అనేది ఉండదు కాబట్టి దాన్ని వదిలేయచ్చు. కానీ పదేళ్ల క్రిందట పరిస్దితి వేరు. ఇప్పుడు ఓటీటిలు వచ్చాక..అన్ని సినిమాలు సబ్ టైటిల్స్ తో దొరికేస్తున్నాయి.దాంతో  రీమేక్‌లంటే చూసేవారికి పెద్దగా ఆసక్తి ఉండట్లేదు. దానికి తోడు  చిరు ఎంచుకుంటున్నది రొటీన్ సినిమాలు. 


ఇక ఇప్పటికే కమిటైన  రెండు రీమేక్‌లు సరిపోవని ఇప్పుడు అజిత్ నటించిన తమిళ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్ మీద చిరు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఓ  వార్త మీడియోలో వినపడుతోంది.  ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో  డబ్బింగైంది. ఇక్కడ ఫరవాలేదన్నట్లుగా ఓ మోస్తరుగా ఆడింది కూడా. మరీ మోహన్ లాల్ ‘లూసిఫర్’ డబ్బింగ్ లాగా వచ్చింది వెళ్లింది అన్నట్లు జరలేదు. తెలుగులో రిలీజై, ఓటీటీలో అందుబాటులో ఉన్న, ఓల్డ్  సినిమాను రీమేక్ చేయడానికి చిరుకు ఇంత ఇంట్రస్ట్ ఏంటో మరి? అంటున్నారు సోషల్ మీడియా జనం. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే ఇప్పటికి అందరూ ఎదురుచూడటమే కారణం. 

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాకి హీరోయిన్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేటట్లు కనపడటం లేదు. మొదట ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె  ఊహించని విధంగా తప్పుకొని షాకిచ్చింది.  దాంతో రకరకాలుగా ఆలోచించి.. మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపేలా  ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్‌తో భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారు కొరటాల. ఈ మేరకు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి కాజల్‌ని తీసుకొచ్చారు. కానీ తీరా సెట్స్ మీదకొచ్చే సమయానికి త్రిష లాగే కాజల్ కూడా  ప్రక్కకు వెళ్లే పరిస్దితి ఉందని తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios