ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల  సమస్యలు,  టికెట్ల విషయం చివరికి చిరు రంగంలోకి దిగితేనే  పరిష్కారం లభించబోతుందనే విషయం నిన్నటి(గురువారం) ఏపీ సీఎం జగన్‌తో చిరు భేటీని బట్టి  అర్థమవుతుంది. 

మెగాస్టార్‌ చిరంజీవి ఏపీ టికెట్ల సమస్యపై రంగంలోకి దిగారు. ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని చెప్పిన ఆయన ఇండస్ట్రీ బిడ్డగా సమస్యని పరిష్కారం దిశగా అడుగులు వేశారు. తాను పెద్దరికాన్ని అంగీకరించకపోయినా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఆయనే పెద్ద అనే విషయాన్ని కన్ఫమ్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల సమస్యలు, టికెట్ల విషయం చివరికి చిరు రంగంలోకి దిగితేనే పరిష్కారం లభించబోతుందనే విషయం నిన్నటి(గురువారం) ఏపీ సీఎం జగన్‌తో చిరు భేటీని బట్టి అర్థమవుతుంది. 

అయితే ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, నాని, నిఖిల్‌, సిద్ధార్థ్‌, ఇతర ప్రొడ్యూసర్లు కొందరు ఏపీలో టికెట్ల విషయంపై ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం పరువుని బజారున పడేసే ప్రయత్నం చేశారు. కానీ చిరంజీవి మాత్రం మొదట్నుంచి చాలా హుందాగా రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. ట్వీట్ల రూపంలో, మరోవైపు సినిమా ఫంక్షన్లలోనూ ఆయన తమ సమస్యని పర్సనల్‌గా తీసుకుని సాల్వ్ చేయాలని సీఎం జగన్‌కి రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. పైగా అంతకు ముందు చిరంజీవి, జగన్‌ ఒకటిరెండు పర్సనల్‌గా మీట్‌ అయ్యారు. వీరి మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్‌ ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవికి జగన్‌ ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తుంది. 

చిరంజీవి, బాలయ్య వంటి వారికి జగన్‌ ఫ్యాన్‌ బాయ్‌. వారికి రెస్పెక్ట్ కచ్చితంగా ఇస్తారని చెప్పొచ్చు. అయితే బాలయ్య తమకి ప్రతిపక్షంలో ఉండటంతో ఆ రిలేషన్‌కి గ్యాప్‌ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ప్రత్యమ్నాయంగా ఉన్న చిరంజీవికే పెద్ద దిక్కు అనే పవర్‌నిచ్చారు జగన్‌. గతంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ వంటి వారు ఏపీ ప్రభుత్వంలో చర్చలు జరిపారు. కానీ సమస్య తగ్గకపోగా, మరింత తీవ్రమవుతూ వచ్చింది. బట్‌ గురువారం జగన్‌తో మీటింగ్‌ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, సమస్య పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

మరో రెండు మూడు వారాల్లో సినిమాకి, థియేటర్లకి, ఇలా అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలుంటాయన్నారు. కమిటీ రిపోర్ట్ ని బట్టి, సీఎం గారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని, తాను చెప్పిన విషయాలను కూడా ఆయన నోట్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి ముఖంలో పాజిటివ్‌ ఎనర్జీ కనిపించింది. సీఎం ఈ విషయంలో పెద్దగా రాద్ధాంతం చేయదలుచుకోవడం లేదనే విషయం అర్థమవుతుంది. 

అయితే ఈ సందర్భంగా చిరంజీవి.. ఇండస్ట్రీకి ఓ స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. కమిటీ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు వచ్చేంత వరకు ఎవరూ దీనిపై మాట్లాడొద్దని, అప్పటి వరకు సంయమనం పాటించాలని తెలిపారు. `అనవసరంగా మీ కోపంతోటి, ఆందోళనతోటి ఎవరుపడితే వాళ్లు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, మాటలు జారడం కానీ చేయవద్దు. పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని అనే నమ్మకం నాకు ఉంది. నా మాటను మన్నించి మీరందరు సమన్వయం పాటించాలని కోరుతున్నాను. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎవరు మాట్లాడొద్దు` అని తెలిపారు. ఓ రకంగా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ లాంటి వారికి చిరు వార్నింగ్‌ ఇచ్చారని అంటున్నారు క్రిటిక్స్. అంతేకాదు ఈ విషయంపై నోరు జారి మాట్లాడుతున్న వారికి చిరు వ్యాఖ్యలు గట్టిగానే తగిలాయని అంటున్నారు.