Asianet News TeluguAsianet News Telugu

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్... ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

సంక్రాంతి బరిలో దిగిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... భారీ టార్గెట్ తోనే చిరంజీవి వస్తున్నారు. 
 

chiranjeevi starer waltair veerayya prerelease business
Author
First Published Jan 10, 2023, 3:30 PM IST

టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. పండుగ మూడు రోజులతో పాటు ఒక వారం వరకు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టవచ్చు. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. అందుకే మేకర్స్ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. చిరంజీవి సినిమాగా మొదలై రవితేజ ఎంట్రీతో మల్టీస్టారర్ గా మారింది. ఇద్దరు మాస్ హీరోలు నటిస్తుండగా... పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

పెద్ద పండగకు వస్తున్న మూవీ కావడంతో బయ్యర్లు అత్యధిక ధరలకు వాల్తేరు వీరయ్య చిత్రాన్ని కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సొంతగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారని సమాచారం. ఏది ఏమైనా వాల్తేరు వీరయ్య బిజినెస్ ఏరియా వైజ్ లెక్క కట్టారు. నైజాం రూ. 18 కోట్లుగా, ఉత్తరాంధ్ర రూ. 10.2 కోట్లుగా ట్రేడ్ వర్గాలు ప్రకటించారు. ఏపీ/తెలంగాణా కలిపి రూ. 72 కోట్ల బిజినెస్ చేసినట్లు రిపోర్ట్ చేస్తున్నారు. 

కర్ణాటక రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2 కోట్లు ఇక ఓవర్సీస్ రూ. 9 కోట్ల బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ రూ. 88 కోట్లుగా తేల్చారు. బ్రేక్ ఈవెన్ రూ. 89 కోట్లు. అంతకు పైన వస్తే మూవీ లాభాల్లోకి వెళ్ళినట్లు. హిట్ కొట్టినట్లు లెక్క. చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ రూ. 55 నుండి 60 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఆ లెక్కన వాల్తేరు వీరయ్య భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు. 

భారీ ధరలకు కొన్నప్పటికీ...సంక్రాంతి పండగ కాపాడుతుందని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్, మేకర్స్ నమ్ముతున్నారు. సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్తేరు వీరయ్య విజయం సాధిస్తుంది, రూ. 89 కోట్ల టార్గెట్ లెక్క కాదు అంటున్నారు. కె ఎస్ రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీ సంగీతం అందించారు. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

ప్రాంతాల వారీగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ 
నైజాం: 18 కోట్లు
సీడెడ్: 15 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.2 కోట్లు
తూర్పు: 6.50 కోట్లు
పశ్చిమ: 6 కోట్లు
గుంటూరు: 7.50 కోట్లు
కృష్ణ: 5.6 కోట్లు
నెల్లూరు: 3.2 కోట్లు
AP-TG మొత్తం:- 72.00 కోట్లు
కర్ణాటక: 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.00 కోట్లు
ఓవర్సీస్ - 9 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్: 88 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios