చిరంజీవి ఇటీవల రెండు రాష్ట్రాల్లోని ప్రముఖమైన మూడు దేవాలయాలను సందర్శించుకోవడం విశేషం. ఆ విశేషాలను వీడియో రూపంలో తయారు చేసి అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల వరుసగా దైవ దర్శనాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ టూర్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ కేవలం 24 గంటల్లో ఆయన రెండు రాష్ట్రాల్లోని ప్రముఖమైన మూడు దేవాలయాలను సందర్శించుకోవడం విశేషం. ఆ విశేషాలను వీడియో రూపంలో తయారు చేసి అభిమానులతో పంచుకున్నారు Chiranjeevi. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఈ నెల (ఫిబ్రవరి) 12న సాయంత్రం ఏడు గంటలకు చిరంజీవి శంషాబాద్ సమీపంలోని `ముంచిత్తల్‌లో కొత్తగా స్థాపించిన రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని(Samatha Murty Statue) సందర్శించారు. తన భార్యసురేఖతో కలిసి సతీ సమేతంగా ఈ సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న 108 దివ్య దేశాల దేవాలయాలను కూడా చిరంజీవి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ తర్వాత రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో బస చేసి, 13వ తేదీ ఉదయం ఐదు గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో కేరళాకి బయలు దేరారు. కొచ్చి విమానాశ్రయం నుంచి శబరిమల అయ్యప్ప టెంపుల్‌కి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఉదయం గం.10.30 నుంచి 11.30 వరకు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ జర్నీలో చిరు దంపతులకు ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపీల ఫ్యామిలీలు తోడుగా ఉండటం విశేషం.
అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో హెలికాప్టర్‌లోనే కేరళాలోని గురువయూర్ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుని తిరిగి కొచ్చికి వెళ్లిపోయారు. ఆట్నుంచి హైదరాబాద్‌కి సాయంత్రం ఏడు గంటల వరకు చేరుకోవడం విశేషం. ఫుల్ బిజీగా చిరంజీవి షెడ్యూల్ సాగడం విశేషం. ఈసందర్భంగా చిరంజీవి మై హోం రామేశ్వరరావుకి, అలాగే ఫీనిక్స్ బ్రదర్స్ కి, పూజారులకు చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం చిరు పంచుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
చిరంజీవి ప్రస్తుతం హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాఢ్‌ఫాదర్`, `భోళాశంకర్`, `మెగా154` చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్యతో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మరోవైపు ఏపీలో టికెట్ల రేట్ల సమస్యని పరిష్కరించడంలో చిరు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
