Asianet News TeluguAsianet News Telugu

ఈ ఫొటోను చిరంజీవి నాకు పంపారన్న వరుణ్ తేజ్!

వాల్మీకి’లో తన లుక్ కోసం తన పెదనాన్న చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు’ను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు. ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కు సంబంధించిన ఫొటోను వరుణ్ తేజ్ చూపించాడు. 

Chiranjeevi Sent this photo to me: Varun Tej
Author
Hyderabad, First Published Sep 19, 2019, 7:45 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’ రేపు( 20న) విడుదల అవనుంది. కెరీర్ ప్రారంభం నుండి   `వాల్మీకి` వ‌ర‌కు వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తున్న వ‌రుణ్ తేజ్‌ ఈ సినిమాలోనూ మరో డిఫరెంట్ పాత్రను పోషించారు. `వాల్మీకి` లో వ‌స్తే ఇందుల గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆ పాత్రకు సంభందించిన లుక్ తో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఓ పాటను సైతం ఈ లుక్ తో రిలీజ్ చేసారు.  రెట్రో లుక్‌లో వ‌రుణ్ తేజ్ ఆక‌ట్టుకుంటున్నాడు. ఆ రెట్రో లుక్ వెనక ఉన్న విషయాన్ని  వరుణ్ తేజ వివరించారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా  మీడియా తో మాట్లాడుతూ ఈ విషయం రివీల్ చేసారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘వాల్మీకి’లో తన లుక్ కోసం తన పెదనాన్న చిరంజీవి నటించిన నాటి చిత్రం ‘పునాదిరాళ్లు’ను ప్రేరణగా తీసుకున్నానని చెప్పాడు. ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కు సంబంధించిన ఫొటోను వరుణ్ తేజ్ చూపించాడు. ఈ ఫొటోను చిరంజీవి తనకు పంపారని చెప్పాడు. అప్పట్లో హీరో అంటే ఇలాగే జుట్టుతో ఉంటారని తన అభిప్రాయమని చెప్పి, వరుణ్ నవ్వించారు.

అలాగే త‌మిళంలో విల‌న్ పాత్ర‌కు లేని ల‌వ్ ట్రాక్‌ను ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ యాడ్ చేశాడ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు వ‌రుణ్ తేజ్‌. ఈ చిత్రంలో అధ‌ర్వ‌ముర‌ళి, పూజాహెగ్డే, మృణాళిని ర‌వి ఇత‌ర ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఇక పునాది రాళ్లు సినిమాలో చిరంజీవి కీలకపాత్రలో నటించారు. వాస్తవానికి ఆ పాత్రకు కమెడియన్ సుధాకర్ను అనుకున్నారంట దర్శకుడు రాజ్కుమార్. అయితే అప్పటికే హీరోగా సినిమాల్లో నిలదొక్కుకుంటున్న సుధాకర్కు భారతీరాజా రూపొందిస్తున్న ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ కారణంగా సుధాకర్ స్థానంలో చిరంజీవిని తీసుకున్నాడు దర్శకుడు. పునాదిరాళ్లు చిత్రంలో హీరో నరసింహరాజు.

Follow Us:
Download App:
  • android
  • ios