`ఉప్పెన` సినిమా ఈ ఏడాది భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరు చెప్పినట్టుగానే సినిమా రికార్డ్ సృష్టించింది. ఓ డెబ్యూ హీరోగా సినిమా ఆరవై కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టడం నిజంగానే రికార్డ్. కొత్త తరహా ఎండింగ్‌తో సినిమా ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా, బుచ్చిబాబుసాన దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా ఈ రేంజ్‌ విజయం సాధించడంతో అంతా చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఈ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, హీరోయిన్‌ కృతి శెట్టిలని మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. గిఫ్ట్స్, గ్రీటింగ్‌లతో సర్‌ప్రైజ్‌  చేశారు. దేవిశ్రీకి గిఫ్ట్స్ పంపించడంతోపాటు ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్‌ని పంపారు చిరంజీవి. ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావో, చిత్రం రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్కి అంతే ప్యాషన్‌తో మ్యూజిక్‌నిస్తావ్‌. నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్‌ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా` అని తెలిపారు చిరంజీవి. ఈ సందర్బంగా చిరంజీవి బిగ్‌ థ్యాంక్స్ చెప్పారు దేవిశ్రీ ప్రసాద్‌. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

మరోవైపు తన చూపులతో, ఎక్స్ ప్రెషన్స్ తో, అద్భుతమైన నటనతో ఫిదా చేసి కలల రాణిలా మారిన కృతి శెట్టిని సైతం చిరంజీవి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ మేరకు ఆమెకి ఓ లెటర్‌ని పంపించాడు. ఇందులో కృతి శెట్టిన అందాన్ని, నటనని చిరంజీవి ప్రశంసించారు. తనని స్టార్‌ పుట్టావని, తెరపై అద్భుతమైన అప్పియరెన్స్ తో ఫిదా చేశావని, తాను స్టార్‌గా నిరూపించుకోవడమే కాదు, అమేజింగ్‌ ఆర్టిస్టుగా నిరూపించుకున్నావన్నారు. కొద్ది రోజుల్లోనే తెలుగు లాంగ్వేజ్‌ నేర్చుకుని అద్భుతంగా ప్రజెంట్‌ చేయగలిగావన్నారు. నీ నటనే నువ్వు వండర్‌ కిడ్‌ అని నిరూపించిందన్నారు. `ఉప్పెన` సక్సెస్‌లో భాగమైన తనని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు చిరంజీవి.