కరోనా, నయన్ ‘లూసిఫర్‌’ ని వెనక్కి లాగేరే

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi s Lucifer remake further gets delayed JSP

 ‘లూసిఫర్‌’ లాంచ్ అయ్యి రెండు నెలలు పైగా అయ్యింది. అయితే షూటింగ్ ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కరోనా వచ్చి మొత్తం ప్లాన్ ని పాడు చేసేసింది. ఈ సినిమా రీమేక్ పనులు కరోనా ఆగిపోయాయి అని తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గాక చేద్దామని చిరంజీవి చెప్పటంతో ప్రాజెక్టు  పెండింగ్ లో పడిదని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా కోసం నయనతారని ఎంచుకుని అడ్వాన్స్ ఇచ్చారు. ఆమె తన డేట్స్ క్లాష్ అవుతున్నాయని నో చెప్పేసింది. దాంతో ఇప్పుడు నయనతార ప్లేస్ లో మరొకరిని వెతకాల్సిన పరిస్దితి. 

ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ చేయనున్నారు..మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం త్వరలోనే తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. సుజీత్, వినాయిక్ లతో మొదట ఈ ప్రాజెక్టు అనుకున్నా చివరకు జయం రాజాకు ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు మెగాస్టార్. 

  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’. 2019 విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా రీమేక్‌ హక్కులను రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో మంజు వారియర్ చేసిన పాత్ర కీలకమైనది. మోహన్ లాల్ చెల్లిగా ఆమె కనిపించింది. తెలుగులో ఈ పాత్ర కోసం మొదట ప్రియమణి అనుకున్నారు. కానీ చివరకు నయనతార ను ఫైనలైజ్ చేసారు. కానీ ఆమె కూడా తప్పుకుంది. నిజానికి ఈ టైమ్ కు నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉండాలి చిత్ర యూనిట్‌. కానీ కరోనా తో మొత్తం ప్రాజెక్టు పనులు స్లో చేసారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios