మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదిన వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఈ పుట్టిన రోజున చిరు తన ఫ్యామీలతో సంతోషంగా గడుపుతున్నారు. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ గా సైరా చిత్ర యూనిట్ ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సైరా టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 

ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ట్వీట్ చేస్తూ తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాంచరణ్ కూడా ఇన్స్టాగ్రామ్లో తన తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేశాడు. 

తాజాగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా ముఖంలో నవ్వు కనిపిస్తోందన్నా, నా జీవితం సంతోషంగా ఉందన్నా అందుకు కారణం నా తండ్రే. లవ్యూ డాడీ. మీకు జన్మదిన శుభాకాంక్షలు అని శ్రీజ పోస్ట్ చేసింది. 

గతంలో శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొదటి భర్త నుంచి విడిపోయింది. 2016లో శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకుంది. ఇటీవలే ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించింది.