అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లో ఈ చిత్రం 68 కోట్ల గ్రాస్ రాబట్టింది.

అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లో ఈ చిత్రం 68 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నిర్మాత, బయ్యర్లకు భారీ లాభాలు ఖాయం అంటూ అంచనా వేస్తున్నారు. 

టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. నిర్మాత సూర్య దేవర నాగవంశీ చిరంజీవికి స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా టిల్లు స్క్వేర్ చిత్రాన్ని చూపించారు. సినిమా చూసిన అనంతరం చిరంజీవి.. హీరో సిద్దు, నాగవంశీ, దర్శకుడు మాలిక్ రామ్ ఇలా చిత్ర యూనిట్ అందరిని అభినందించారు. 

Scroll to load tweet…

టిల్లు స్క్వేర్ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ తో ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. కానీ టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ అది చేసి చూపించారు. హీరో డైరెక్టర్, టెక్నికల్ టీం ఐలా అందరి కృషితో ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది అని చిరు అభినందించారు. 

Scroll to load tweet…

సిద్దు జొన్నలగడ్డని ప్రత్యేకంగా చిరు అభినందించారు. ఇక చిత్ర నిర్మాత నాగవంశీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ లో ధైర్యం ఉన్న యువ నిర్మాతలలో నాగవంశీ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు నిర్మిస్తున్నారు అని చిరు అన్నారు. ఈ చిత్రం వెనుక సిద్దు ఒక్కడే ఉండి అంతా నడిపించాడు అని చిరు ప్రశంసలు కురిపించారు.